టీఆర్‌ఎస్‌ నేత కుమారుడి పెళ్లికి మంత్రి అజయ్‌

Tue,December 10, 2019 01:08 AM

రఘునాథపాలెం:టీఆర్‌ఎస్‌ పార్టీ మండల నాయకుడు భుక్యా లక్ష్మణ్‌ నాయక్‌ కుమారుడు ఉదయ్‌ కుమార్‌ వివాహం సోమవారం మండల కేంద్రం రఘునాథపాలెంలో గల గణేష్‌ గార్డెన్‌లో జరిగింది. దీనికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ పాల్గొని నూతన వధూవరులు ఉదయ్‌ కుమార్‌-శ్రీలేఖలను అక్షింతలు వేసి ఆశీర్వదించారు.వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్‌ కూడా పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మద్దినేని వెంకటరమణ, వైస్‌ చైర్మన్‌ పిన్ని కోటేశ్వరరావు, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు కుర్రా భాస్కర్‌రావు, మాజీ ఎంపీ పొంగులేటి క్యాంపు కార్యాలయం ఇన్‌చార్జ్‌ తంబూరి దయాకర్‌రెడ్డి, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మానుకొండ రాధాకిషోర్‌, మాజీ జడ్పీటీసీలు అజ్మీరా వీరూనాయక్‌, మలీదు హైమావతి, టీఆర్‌ఎస్‌ నాయకులు తుమ్మలపల్లి మోహన్‌రావు, బచ్చు విజయ్‌ కుమార్‌, మంచుకొండ ఉపసర్పంచ్‌ తేజావత్‌ రమేష్‌, చెన్నబోయిన సైదులు తదితరులు పాల్గొన్నారు.

264
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles