భక్తరామదాసు ధ్యానమందిరానికి రూ.3 కోట్లు మంజూరు

Thu,December 5, 2019 04:14 AM

-ఆడిటోరియం స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్, సీఈవో
నేలకొండపల్లి, డిసెంబర్ 4: నేలకొండపల్లిలోని భక్త రామదాసు ధ్యాన మందిరంలో నూతనంగా నిర్మించనున్న ఆడిటోరియం స్థలాన్ని కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్, జడ్పీ సీఈఓ ప్రియాంకలు బుధవారం పరిశీలించారు. ఈసందర్భంగా భక్త రామదాసు ధ్యాన మందిరంలో ఆడిటోరియం నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.3 కోట్లను మంజూరు చేసింది. దీంతో ఆర్‌అండ్‌బీ అధికారులు తయారు చేసిన ఆడిటోరియం మ్యాప్‌ను కలెక్టర్ కర్ణన్ పరిశీలించారు. వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో ఇక్కడ జయంత్యుత్సవాలను నిర్వహించనుండటంతో రామదాసుకు చెందిన కాంస్య విగ్రహాన్ని తయారు చేయించాలని ఆదేశించారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ఉన్న రామదాసు విగ్రహం నమూనా ప్రకారం తయారు చేయించి ధాన్య మందరంలో ఆవరణలో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా రాయితో చెక్కిన విగ్రహాన్ని మరోకటి తయారు చేయించాలని సూచించారు.

ధ్యాన మందిరం పక్కనే ఉన్న పాత వేదికను, గదులను తొలగించి కొత్త వేదికను కూడా జయంత్యుత్సవాల నాటికి సిద్ధం చేయాలన్నారు. జయంత్యుత్సవాల కోసం స్థలాన్ని చదును చేయించాలని సూచించారు. అనంతరం ధ్యాన మందిరంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో కలెక్టర్ కర్ణన్, సీఈఓ ప్రియాంకలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వజ్జా రమ్య, సర్పంచ్ రాయపూడి నవీన్, ఎంపీటీసీ బొడ్డు బొందయ్య, జిల్లా పర్యాటక శాఖ అధికారి సుమన్ చక్రవర్తి, ఆర్‌అండ్‌బీ ఈఈ శ్యాంప్రసాదు, డీఈ యుగంధర్, ఎంపీడీవో రవికుమార్, ఇన్‌చార్జి తహసీల్దార్ స్వాతిబిందు, ఆర్‌ఐ రమేష్, భక్త రామదాసు విద్వత్ కళాపీఠం అధ్యక్షుడ సాధు రాధకృష్ణమూర్తి, పెండ్యాలా గోపాలకృష్ణమూర్తి, కాండూరి వేణు, అనుమాల నరసింహరావు, అర్చకులు రమేష్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

69
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles