అమ్మగూడెం సర్పంచ్‌పై డీపీవోకు ఫిర్యాదు

Thu,December 5, 2019 04:14 AM

నేలకొండపల్లి : మండలంలోని అమ్మగూడెం గ్రామ సర్పంచ్ గండు సతీశ్‌పై పంచాయతీ ఉప సర్పంచ్ అడపాల జగత్‌సాయి వెంకటేశ్ బుధవారం జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేశారు. ఉపసర్పంచ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులు, చెక్కులపై సంతకాలు చేయాలని సర్పంచ్ వత్తిడి చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. గ్రామంలో రూ.25 లక్షల వరకు ఖర్చు పెట్టినట్లు, సంతకం పెట్టమన్న చోట పెట్టండి, లేకపోతే రాజీనామా చేయాలంటున్నాడని తెలిపారు. తన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఉప సర్పంచ్ వెంకటేష్ డీపీవోకు విన్నవించారు. ఈ విషయమై సర్పంచ్ గండు సతీశ్‌ను వివరణ కోరగా తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని అన్నారు.

62
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles