- పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్
ఖమ్మం క్రైం : న్యాయం కోరుతూ పోలీసు స్టేషన్కు వచ్చిన వారిని ఆదరించి కేసుల నమోదులో జాప్యాన్ని వీడాలని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ పోలీస్ అధికారులను సూచించారు. బాధితుల ఆత్మగౌరవనికి భంగం కలగకుండా సేవ చేయాలనే సమాజిక స్పృహ సిబ్బందిలో ఉండాలని అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని స్పెషల్ బ్రాంచ్ కాన్ఫరెన్స్ హల్లో నేర సమీక్ష సమావేశం జరిగింది. సమావేశంలో సీపీ పాల్గొని మాట్లాడారు. బాధితులు ఫిర్యాదుల పట్ల సకాలంలో స్పందిస్తూ బాధ్యతయుంగా వ్యవహరించాలన్నారు. ఫిర్యాదుల పట్ల స్పందన లేకపోతే సంబంధిత అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ దాసరి మురళీధర్, అడిషనల్ డీసీపీ (ఆడ్మిన్) ఇంజారపు పూజ, ఏసీపీలు ప్రసన్న కుమార్, గణేశ్, వెంకట్రావు, వెంకటరెడ్డి, వెంకటేశ్, జహాంగీర్, సీఐలు తదితరులు పాల్గొన్నారు.