ధ్రువీకరణ పత్రాలు సత్వరం అందించాలి..

Sat,November 16, 2019 12:30 AM

ఖమ్మం వ్యవసాయం : విహహ నమోదు చట్టం మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో విహహ నమోదు ధ్రువీకరణ పత్రాలు సత్వరమే జారీ చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. తప్పనిసరి విహహ చట్టం-2002 పై జిల్లా స్త్రీ శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ కార్యదర్శులు, సీడీపీఓలు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లకు శుక్రవారం భక్తరామదాసు కళాక్షేత్రంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని అధికారులకు, సిబ్బందికి, విహహ నమోదుచట్టం పట్ల పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో జరిగే వివాహాల పట్ల స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు గ్రామస్థాయి అధికారులకు ముందస్తుగానే సమాచారం ఉంటుందని, విహహ శుభలేఖలతో పాటు దరఖాస్తు దారుని నుంచి దరఖాస్తు పొంది విహహం రోజునే నమోదు ధ్రువీకరణ పత్రం అందించే విధంగా పంచాయతీ కార్యదర్శులు ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.

అదే విధంగా జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం చేయకుండా వెంటనే జారీ చేయాలన్నారు. గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు అన్ని శాఖలతో సమన్వయంగా ఉండి ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం జరగకుండా చూడాలని సూచించారు. బాల్యవివాహాలను పూర్తిగా అరికట్టాలని, బాల్యవివాహాలకు పాల్పడినా, ప్రోత్సహించిన వారు నేరస్తులుగా పరిగణించబడుతారన్నారు. పంచాయతీ పరిధిలో ఎక్కడైనా బాల్యవివాహాల కేసుల ఫిర్యాదులు అందిన యెడల సంబంధిత కార్యదర్శి, అంగన్‌వాడీ సిబ్బందిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నెల రోజుల గ్రామ ప్రణాళికలో భాగంగా జిల్లాలోని అన్ని పంచాయతీలలో గుణాత్మకమైన మార్పు వచ్చిందని కార్యదర్శులను కలెక్టర్ అభినందించారు. మంగళవారం, శుక్రవారం రెండు రోజులు తప్పనిసరిగా డ్రై డేను పాటించాలని సూచించారు.

చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి :
డీఎల్‌సీఏ కార్యదర్శి వినోద్‌కుమార్
వివాహనమోదు చట్టాన్ని గ్రామాల్లో పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా లీగల్‌సెల్ అథారిటీ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వినోద్‌కుమార్ తెలిపారు. నిత్యం క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యదర్శులు స్థానిక పరిస్థితులపై పూర్తిస్థాయిలో అవగాహన ఉంటుందన్నారు. అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21ఏళ్లు నిండిన తరువాతనే పెళ్లిళ్లు జరిగే విధంగా చొరవ తీసుకోవాలన్నారు. బాల్యవివాహాలు జరిగే జిల్లాలో ఖమ్మం జిల్లా మూడవ స్థానంలో ఉందన్నారు. సంవత్సరానికి రూ.3లక్షల ఆదాయం కలిగిన ఎస్సీ, ఎస్టీలు, మహిళలు, 18 సంవత్సరాలలోపు పిల్లలు, శారీరక, మానసిక వికలాంగులు, అక్రమ రవాణా బాధిత మహిళలు ఉచిత న్యాయ సహాయం పొందేందుకు అర్హులని, ఈ సమాచారాన్ని ప్రజలకు తెలియజేయాలని ఆయన కోరారు.
గ్రామాల్లో అవగాహన కల్పించాలి : జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరెడ్డి
తప్పనిసరి వివాహనమోదు చట్టంపై గ్రామాల్లో ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని డీపీఓ శ్రీనివాసరెడ్డి సూచించారు. 2002 వివాహ నమోదు చట్టం అమలులో నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఐసీడీఎస్ చేపట్టిన అవగాహన కార్యక్రమం పట్ల మంచి ఫలితాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళాశక్తి సమన్వయ కర్తలు పీ శ్రీదేవి, కే స్వరూపారాణి, విస్తరణ అధికారి టీ ప్రభావతి, ఐసీడీఎస్ సూఫరిండెంట్ లతాకుమారి, జిల్లా కార్యాలయం అధికారులు ముత్తయ్య, పోషణ్ అభియాన్ కార్యకర్తలు, ఆయా ప్రాజెక్టుల సీడీపీఓలు, సూపర్‌వైజర్లు, అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

241
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles