గిరిజన స్పోర్ట్స్ అకాడమీలో సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

Fri,November 15, 2019 12:38 AM

భద్రాచలం, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల స్పోర్ట్స్ అకాడమీ ద్వారా వివిధ క్రీడా పాఠశాలలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీవో వీపీ గౌతమ్, భద్రాచలం ఐటీడీఏ ప్రాంతీయ సమన్వయ అధికారి, ఖమ్మం రీజియన్ ఎస్‌కే బురాన్‌లు ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత గల విద్యార్థులు తమ దరఖాస్తులను ఈనెల 16వ తేదీ ఉదయం 9గంటలకు గిరిజన బాలికలు సుదిమళ్ల పాఠశాలలో అందజేయాలని సూచించారు. పూర్తి వివరాలకు భద్రాద్రి కొత్తగూడెం గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల కిన్నెరసాని పీడీ, భద్రయ్య టీటీడబ్ల్యూఆర్‌సీ(బీ) కిన్నెరసాని వారిని, సెల్ నెం. 7660065688ను సంప్రదించాలని కోరారు.

274
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles