పాల్గొన్న మాజీఎంపీ పొంగులేటి, ఎమ్మెల్యే సండ్ర

Fri,November 15, 2019 12:38 AM

తల్లాడ:హరిహరిసుత అయ్యప్పస్వామి మహాపడిపూజను బుధవారం రాత్రి మండ పరిధిలోని మల్లవరంలో ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన కటికి కిరణ్, సీతారాములు స్వాముల ఆధ్వర్యంలో గురుస్వామి కంచల సతీష్‌శర్మ పడిపూజ క్రతువును జరిపించారు.పూజలో మాజీఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గొన్నారు. భక్తిపాటల గాయకుడు గణేష్‌స్వామి ఆలపించిన అయ్యప్పస్వామి పాటలతో పూజాప్రాంగణం పులకించింది. పంచా మృతాలు, నవరసాలతో అయ్యప్పస్వామికి అభిషేకం నిర్వహించారు. గణపతి, సుబ్రమణ్యేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు ధనకొండ కృష్ణయ్య, పెరిక నాగేశ్వరరావు, బొడ్డు కృష్ణయ్య, ఎర్రి నరసింహారావు, బొడ్డు మల్ల య్య, భూక్యా బాలయ్య, గరిడేపల్లి సత్యం, తదితరులు పాల్గొన్నారు.

268
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles