మంత్రి పువ్వాడ హామీతో విధుల్లో చేరిన వీఆర్‌ఓలు

Fri,November 15, 2019 12:38 AM

ఖమ్మం నమస్తేతెలంగాణ: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ హామీతో గ్రామ రెవెన్యూ అధికారులు విధుల్లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు.తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వీఆర్‌ఓ, వీఆర్‌ఏ లు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పెన్‌డౌన్ కార్యక్రమంలో భాగంగా గురువారం ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షులు గరిక ఉపేందర్‌రావు , టీఎన్‌జీఓస్ రాష్ట్ర నాయకులు అఫ్జల్‌హసన్ , ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగుల్‌మీరా, నాగేందర్, మండలాల అధ్యక్ష, కార్యదర్శులు మంత్రి పువ్వాడను కలిసి వినతిపత్రం అందచేశారు.

దీనికి వెంటనే స్పందించిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి వారి సమస్యలను తీసుకవెళ్లడంతో పాటు యువనేత, మంత్రి కేటీఆర్‌తో సంఘ నాయకుల సమావేశం ఏర్పాటు చేపిస్తామని, మీ సమస్యల పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారికి అసౌకర్యం కలుగకుండా చూడాలని సంఘ నాయకులను మంత్రి పువ్వాడ కోరారు. అందరూ పెన్‌డౌన్ విరమించి రాష్ట్ర వ్యాప్తంగా విదుల్లో చేరాలని అన్నారు.మంత్రి హామీతో పెన్‌డౌన్ కార్యక్రమాన్ని విరమిస్తున్నట్లు సంఘ నాయకులు తెలిపారు.సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన మంత్రికి సంఘ నాయకులు ధన్యవాదాలు తెలిపారు.

285
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles