39వ రోజు..76 వేల మంది

Wed,November 13, 2019 02:16 AM

- ప్రయాణికులను చేరవేసిన 384 వాహనాలు
- దూరప్రాంతాలకూ కొనసాగుతున్న సర్వీసులు
- షెడ్యూల్‌ ప్రకారమే నడుస్తున్న ఆర్టీసీ బస్సులు
- బందోబస్తును పర్యవేక్షించిన సీపీ, ఏడీసీపీ

(ఖమ్మం కమాన్‌బజార్‌) జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులన్నీ షెడ్యూల్‌ ప్రకారంగానే తిరుగుతున్నాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె మంగళవారానికి 39వ రోజుకు చేరినా ఆ ప్రభావం జిల్లాలో ఏమాత్రమూ కన్పించడం లేదు. మంగళవారం నాడు జిల్లాలో 384 బస్సులు తమ సర్వీసులను అందించాయి. సుమారు 74 వేల మంది ప్రయాణికులను తమ తమ గమ్యస్థానాలకు చేర్చాయి. కార్మికులు సమ్మె చేస్తున్నప్పటికీ ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంది. తద్వారా తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులు సేవలందిస్తున్నాయి. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు తొలగిపోయాయి. జిల్లాలో ప్రజా రవాణా వ్యవస్థపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు. ఆర్టీసీ సాధారణ షెడ్యూల్‌ ప్రకారమే బస్సులన్నీ తిరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలతోపాటు దూర ప్రాంతాలకూ సర్వీసులు కొనసాగుతున్నాయి. ఖమ్మం డిపోను అడిషనల్‌ డీసీపీ మురళీధర్‌ సందర్శించారు. బందోబస్తు వివరాలను అక్కడున్న టూటౌన్‌ ఎస్‌ఐ ఉదయ్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు.

384 వాహనాలు..
మంగళవారం ఖమ్మం డిపోలో ఆర్టీసీ బస్సులు 79, అద్దె బస్సులు 58, సత్తుపల్లి డిపోలో ఆర్టీసీ బస్సులు 69, అద్దె బస్సులు 35, మధిర డిపోలో ఆర్టీసీ బస్సులు 34, అద్దె బస్సులు 19 నడిచాయి. వాటితోపాటు రవాణా శాఖ అధికారుల ఏర్పాటుచేసిన ప్రైవేట్‌ బస్సులు 20, మాక్సీక్యాబ్‌లు 70 నడిచాయి. జిల్లాలో మొత్తం 384 వివిధ వాహనాలు తిరిగాయి. జిల్లాలో 76 వేలమంది ప్రయాణీకులు ప్రయాణాలను కొనసాగించారు.

బందోబస్తును పర్యవేక్షించిన సీపీ
జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా శాంతిభద్రతలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ నేతృత్వంలో అడిషనల్‌ డీసీపీ మురళీదర్‌ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. జిల్లాలోని ఖమ్మం, సత్తుపల్లి, మధిర డిపోలల్లో డిపో, బస్టాండ్‌ల వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటుచేసి వారికి సూచనలు చేస్తూ పర్యవేక్షిస్తున్నారు.

266
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles