టీఆర్‌ఎస్ నాయకుడి ఇల్లు దగ్ధానికి యత్నం

Tue,November 12, 2019 02:13 AM

ఇల్లెందు, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్ పట్టణ కమిటీ ప్రచార కార్యదర్శి మేకల శ్యాం ఇంటిని దగ్ధం చేసేందుకు గుర్తు తెలియని దుండగులు యత్నించారు. సోమవారం ఉదయం జరిగిన తీరు చూసి టీఆర్‌ఎస్ నాయకుడు మేకల శ్యామ్ ఆందోళన వ్యక్తం చేశారు. బాధితుడి కథనం ప్రకారం.. ఆదివారం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తలుపులపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఇంట్లో నిద్రిస్తున్న శ్యామ్ తల్లి కేకలు వేస్తూ నీళ్లు తీసుకొచ్చి మండుతున్న మంటలను ఆర్పి వెంటనే కొడుకుకు సమాచారం అందించింది. కాఆ జరిగిన విషయాన్ని ఎమ్మెల్యే హరిప్రియనాయక్ , నాయకులకు తెలియజేశాడు. జరిగిన ఘటనపై ఆందోళన వ్యక్తం చేశాడు. జరిగిన విషయాన్ని తెలుసుకున్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యుడు పులిగళ్ల మాధవరావు, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు దమ్మలపాటి వెంకటేశ్వరరావు(డీవీ), ఎంపీపీ చీమల నాగరత్నమ్మ, ఖమ్మంపాటి రేణుక, యలమద్ది రవి, ఎస్ రంగనాథ్, లింగాల జగన్నాథం, సుధీర్‌తోత్లా, జేకే మహేశ్, ఇంద్రాల మురళి, మెరుగు కార్తీక్, దళిత సంఘాల నాయకులు ఇంటిని పరిశీలించి ఘటనను ఖండించారు. శ్యాం ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్ధలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

261
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles