కారేపల్లి రూరల్ : పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన లాకావత నందిని (20) చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. సింగరేణి మండలం ఫైల్తండాకు చెందిన నందిని ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించాడని ఈ నెల వ తేదీన పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ఆమెను ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఫైల్తండాకు చెందిన బాణోతు సురేశ్, నందినిలు ఆరు నెలలుగా ప్రేమించుకుంటున్నారు. పెండ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లోబర్చుకుని పెళ్లికి నిరాకరించాడని బాధితురాలి కుటుంబసభ్యులు పేర్కొన్నారు. పెద్దలు పెళ్లికి ఒప్పించడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడమే కాక, నందినిని నిందించడంతో ఆమె పురుగుమందు తాగినట్లు కుటుంబసభ్యులు ఆరోపించారు.