భద్రత కల్పించాలని రెవెన్యూ ఉద్యోగుల వినతి

Tue,November 12, 2019 02:12 AM

మయూరిసెంటర్: రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న అధికారులకు, ఉద్యోగులకు భద్రత కల్పించాలని కోరుతూ తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (టీఆర్‌ఈఎస్‌ఏ), టీఎన్‌జీవోస్ రాష్ట్ర నాయకులు అఫ్జల్‌హసన్ ఆధ్వర్యంలో సోమవారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్‌లో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రెసా అధ్యక్ష, కార్యదర్శులు కారుమంచి శ్రీనివాసరావు, తుంబురు సునీల్‌రెడ్డి, అఫ్జల్ హసన్‌లు మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా తహసీల్దార్ విజయారెడ్డి హత్య ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా పునరావృత్తం కాకుండా చూడాలని, రెవెన్యూ విభాగంలో ఉన్నతాధికారుల నుంచి ఉద్యోగుల వరకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ అధికారులకు, ఉద్యోగులకు రక్షణ కల్పించాలని కో రుతూ ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు, జిల్లా కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్, ఖమ్మం సీపీ తఫ్సీర్ ఇక్బాల్‌లకు వినతి పత్రాలను ఖమ్మంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి వెంకటేశ్వర్లు, తహసీల్దార్లు రాంమూర్తి, సత్యనారాయణ, రియాజ్ అలీ, వెంకన్న, స్వామి, అనురాధబాయి తదితరులు పాల్గొన్నారు.

274
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles