మయూరి సెంటర్, నవంబర్ 11: టీటీడీ తెలంగాణ సలహామండలి (ఎల్ఏసీ) వైస్ ప్రెసిడెంట్‌గా దరువు ఎండీ సీహెచ్ కరణ్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. నవంబర్ 11 సాయంత్రం హిమాయత్ నగర్‌లోని టీటీడీలో జరిగిన ఓ కార్యక్రమంలో కరణ్‌రెడ్డి టీటీడీ తెలంగాణ సలహా మండలి వైస్ ప్రెసిడెంట్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ ప్రాంత టీటీడీ ఆలయాలు, సమాచార కేంద్రాల సలహా సంఘానికి ఉపాధ్యక్షుడిగా కరణ్‌రెడ్డి వ్యవహరిస్తారు. హిందూ ధార్మిక పరీరక్షణకు చేస్తున్న కృషికిగాను కరణ్‌రెడ్డికి ఈ బాధ్యతలను టీటీడీ అప్పగించింది. కాగా టీటీడీ బోర్డ్ హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, చైన్నై, బెంగళూరు, భువనేశ్వర్, ముంబై నగరాలకు సంబంధించి టీటీడీ స్థానిక సలహామండలి (ఎల్ఏసీ)లను ఏర్పాటు చేసిన సంగతి విధితమే. టీటీడీ బోర్డ్ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు టీటీడీ పాలనా విభాగం జేఈవో బసంత్‌కుమార్ హైదరాబాద్ స్థానిక సలహా మండలిని ఏర్పాటు చేస్తూ నవంబర్ 1న జీవో జారీ చేశారు.
ఈ మేరకు సోమవారం కరణ్‌రెడ్డి టీటీడీ సలహామండలి ఉపాధ్యక్షులుగా పదవీ బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ ప్రాంత టీటీడీ సలహామండలిలో వైస్ ప్రెసిడెంట్ కరణ్రెడ్డితో సహా మొత్తం 20 మంది సభ్యులు ఉన్నారు. కరణ్రెడ్డిలోని కార్యదక్షత, ధార్మిక సేవాగుణాన్ని గుర్తించిన టీటీడీ ఆయనకు తెలంగాణ ప్రాంత స్థానిక సలహా మండలి వైఎస్ ప్రెసిడెంట్ పదవిని కట్టబెట్టింది. ఈ సందర్భంగా కరణ్‌రెడ్డి మాట్లాడుతూ ఏడుకొండల వాడికి సేవ చేసే భాగ్యం కల్పించిన ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు, తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు టీటీడీ బోర్డ్ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. నాపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని, తెలంగాణ రాష్ట్రంలో టీటీడీ దేవాలయాలు, కల్యాణమండపాల అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని కరణ్‌రెడ్డి తెలిపారు. టీటీడీ తెలంగాణ సలహా మండలి వైస్‌ప్రెసిడెంట్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన దరువు ఎండీ కరణ్‌రెడ్డి తెలుగు రాష్ర్టాల నుంచి పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.