తెలంగాణ ప్రభుత్వంలోనే గ్రంథాలయాలకు పూర్వవైభవం

Sun,November 10, 2019 12:08 AM

మయూరిసెంటర్:పాఠకులకు, విద్యార్థులకు, నిరుద్యోగ అభ్యర్థులకు విజ్ఞానాన్ని పంచే గ్రంథాలయాలను అభివృద్ధి పరచటం ప్రభుత్వ ధ్యేయమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శనివారం జిల్లా కేంద్రం లోని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయాన్ని సందర్శించి సంస్థ చైర్మన్ ఎండీ ఖమర్‌తో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న పుస్తకాల సంఖ్య పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థుల హాజరు శాతం, మౌలిక వసతుల కల్పన తదితర అంశాల గురించి చైర్మన్‌ను అడిగి తెలుసుకు న్నారు. సత్తుపల్లిలో ఎస్సీ హాస్టల్ భవనం ఖాళీగా ఉందని, ఆ భవనంలో లైబ్రరీ ఏర్పాటు చేసి పాఠకులకు, విద్యార్థులకు అందించాలని కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్‌ను ఫోన్‌లో కోరారు. అనంతరం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలోనే గ్రంథాల యాలకు పూర్వవైభవం వచ్చిందన్నారు. ఉమ్మడి ప్రభుత్వంలో ఏ ప్రభుత్వ శాఖకు, అణగారిన వర్గాల ప్రజలకు మేలు జరగలేదన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ఆవిర్భావం నుంచే ప్రభుత్వ శాఖలతో పాటు జిల్లా గ్రంథాలయాల అభివృద్ధ్ది కోసం ప్రత్యేక దృష్టిసారించి మౌలిక వసతులు, నూతన పుస్తకాల ఏర్పాటు చేశారన్నారు. గ్రంథాలయాల అభివృద్ధి కోసం మంత్రి అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్‌ల కృషితో కార్పొరేట్ స్థాయి గ్రంథాలయాన్ని ఖమ్మం జిల్లా కేంద్రంలో విద్యార్థులకు అందుబాటులో ఉంచడం జరిగిందని స్పష్టం చేశారు. గడిచిన వేసవికాలంలో అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఉచిత కోచింగ్‌ను విద్యార్థులకు నూతన బల్లాలు, ఏసీ ఏర్పాట్లతో,విశాలమైన హాలులో విద్యార్థులకు, నిరుద్యోగ అభ్యర్థులకు గ్రంథాలయాలు దోహదపడ్డాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ సెక్రటరీ అర్జున్, ఉద్యోగులు భాస్కర్, నాగన్న, అఖిల్ తదితరులున్నారు.

174
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles