రేపు స్ఫూర్తి కుటుంబ సమావేశం..

Fri,November 8, 2019 11:27 PM

ఖమ్మం, నమస్తే తెలంగాణ: ఆధ్యాత్మిక విశ్వగురువు, సైన్టిఫిక్ సెయింట్ శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి భౌతిక-ఆధ్యాత్మిక, అనుభవపూర్వక జ్ఞానం, మానవజాతి మేలు కోసం ఆయన చేసిన రచనలను సమాజంలోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఆయన అనుచరులు, భక్తులు ఖమ్మంలో ఆదివారం స్ఫూర్తి కుటుంబ సమావేశం ఏర్పాటు చేశారు. నగరంలోని మమత హాస్పిటల్ రోడ్డులో స్వర్ణభారతి ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్‌బీఐటీ)లో ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా ఉన్న గురు విశ్వస్ఫూర్తి భక్తులు హాజరవుతున్నారు. ఈ సమావేశంలో యోగ, ప్రాణయామం, ధ్యానం, మనిషి, మనసు మానవ జీవితం, సమాజం మతం, ఆధ్యాత్మికం, దైవంతో పాటు జీవం, జీవపరిణామం, సృష్టి, ఆవిర్భావం తదితర అంశాలపై చర్చిస్తారు. మూఢ నమ్మకాలను పారదోలి, మనిషిలోని పశు ప్రవృత్తి, కౄరత్వాన్ని తొలగించాలని, మానవత్వాన్ని పెంపొందించాలని గురు విశ్వస్ఫూర్తి రచనలు సూచిస్తాయి.

ఆసనం ప్రాణయామం ధ్యానం మానవత్వం పెంపుదలకు దోహదపడుతాయని గురూజీ పేర్కొన్నట్లు ఈ కార్యక్రమ నిర్వాహకులు తుంబూరు దయాకర్‌రెడ్డి, నువ్వుల సురేష్, డాక్టర్ ధనాలకోట రామారావు, కానుగుల రాధాకృష్ణ, పిన్నమనేని భానుకృష్ణ, వడ్డెం విక్రం, స్రవంతి, గుంటి ప్రసాద్, బాడిశ వెంకటేశ్వర్లు, సత్యనారాయణరెడ్డి, ఆళ్ల రాజేష్, సిద్దయ్యలు తెలిపారు. సమాజంలో చెడును తొలగించి మంచిని పెంపొందించేందుకు ఈ సదస్సు దోహదపడుతుందని పేర్కొన్నారు. మనిషిని నడిపించే మనసులో మార్పు తీసుకురావడం కోసం గురు విశ్వస్ఫూర్తి వారు ధ్యాన మనోప్రస్థానం సిద్దాంతాన్ని పత్రిపాదించినట్లు తెలిపారు. మానవ శక్తి సమీకరణే.. మానవ లోక ఉద్దరణ అనే నినాదంతో దేశ నలుమూలల భక్తులు హాజరై ఈ సమావేశాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరారు.

187
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles