సంక్షేమ ఫలాలు అందించడమే కేసీఆర్ ధ్యేయం

Fri,November 8, 2019 01:19 AM

సత్తుపల్లి, నమస్తే తెలంగాణ, నవంబర్ 7 : తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన చేపడుతున్నారని, ఫలాలు అందుకుంటున్న ప్రజలు కేసీఆర్ పాలనకు బ్రహ్మరథం పడుతున్నారని టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేష్‌రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలు అన్నారు. గురువారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెనుబల్లి, వేంసూరు మండలశాఖ ఎన్నికపై అభిప్రాయసేకరణ కొనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుదీర్ఘరాజకీయాల్లో ఉండి పార్టీని నడిపించే కార్యకర్తలను గుర్తించి సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు క్రియాశీలకంగా వ్యవహరించే నాయకులను ఎన్నుకుని కమిటీ ఎన్నిక అనంతరం ప్రతీ బాధ్యునికి హైదరాబాద్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు వారు తెలిపారు. పార్టీ, ప్రజలతో సత్సంబంధాలు ఉండి పార్టీని మండలాల్లో అగ్రగామిగా నిలిపే వ్యక్తులను నియమింపచేస్తామని తెలిపారు. ప్రతీ కార్యకర్త తెరాస అభివృద్ధి కోసం కృషిచేయాలని వారు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, జడ్పీటీసీలు కూసంపూడి రామారావు, చెక్కిలాల మోహన్‌రావు, కల్లూరు ఏఎంసీ చైర్మన్ చెక్కిలాల లక్ష్మణరావు, వేంసూరు ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, సర్పంచ్‌లు ఎండీ.ఫైజుద్దీన్, మందపాటి వేణుగోపాలరెడ్డి, నాయకులు రామప్ప, చీకటి రంగారావు, శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, కూసంపూడి మహేష్, వెల్ది జగన్మోహనరావు, ముక్కెర గోపాలరెడ్డి, చింతనిప్పు సత్యనారాయణ, కనగాల సురేష్‌బాబు, లక్కినేని వినీల్, సురేష్, రావి శ్రీనివాసరావు, అట్లూరి సత్యనారాయణ, భీమిరెడ్డి చెన్నకేశవరెడ్డి పాల్గొన్నారు.

183
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles