తల్లీబిడ్డలకు నాణ్యమైన వైద్య సేవలందాలి..

Fri,November 8, 2019 01:19 AM

-జిల్లా ఆసుపత్రిని సందర్శించిన ప్రొఫెసర్ డాక్టర్ బలరామ్
మయూరిసెంటర్: మాతా శిశు సంరక్షణ, ఆరోగ్యసేవలలో నల్గొండ జిల్లాని ఆదర్శంగా తీసుకుని సేవలలో ముందుకు వెళ్లాలని మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ ప్రస్ర్తా పెడియాట్రిక్ హెచ్‌వోడీ డాక్టర్ బలరామ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ ప్రధాన వైద్యశాలలో చిన్నారులు, గర్భిణులకు అందుతున్న ఆరోగ్యసేవల అంశంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బీ వెంకటేశ్వర్లును వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు, బాలింతలకు నాణ్యతా ప్రమాణాలు కలిగిన వైద్యసేవలను అందించాలన్నారు. నవజాత శిశువులకు అందుతున్న ఆరోగ్యసేవలలో భాగంగా ఇన్‌ఫెక్షన్, చిన్నారుల ఎదుగుదల, చిన్నారులకు వచ్చే ఆరోగ్యసమస్యల గురించి సలహాలు, సూచనలిచ్చారు. కంగారో మదర్‌కేర్ సేవల ద్వారా తల్లిబిడ్డలు తక్కువ రోజుల్లో ఆసుపత్రి నుంచి ఆరోగ్యవంతులుగా ఇంటికి వెళ్లవచ్చు అన్నారు. శిశువు తల్లి పొత్తిలలో నిద్రించడం ద్వారా శిశువు వెచ్చగా ఉండేం దుకు అవకాశం ఉంటుందని, తల్లికి పాలు అధికంగా ఉత్పత్తి అవుతాయని, తల్లి పాలు తాగడం ద్వారా ఆ శిశువుకు ఇన్‌ఫెక్షన్ సోకకుండా ఆరో గ్యవంతంగా ఉంటుందన్నారు.

నవజాత శిశువుకు కంగారో మదర్‌కేర్ సేవల ద్వారా మెదడు అభివృద్ధి చెందుతుందన్నారు. వారానికి ఒక్కసారి శిశువుల ఆరోగ్య అంశాలు, సాధారణ ప్రసవాల సంఖ్య, ఆరోగ్యసేవల గురించి వాకబు చేయనున్నట్లు తెలిపారు. నల్గొండ జిల్లాలో అక్కడి సిబ్బంది కంగారో మదర్‌కేర్, సాధారణ ప్రసవాలు, బాలింతలకు అందించే ఆరోగ్యసేవలలో ముందున్నారని ఆయన నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ వైద్యశాలలో కొనసా గుతున్న సేవలను కొనియాడారు. జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్ భవనంలో ఎస్‌ఎన్‌సీయూ పీఐసీయూ వార్డులలో చిన్నారులకు అందుతున్న సేవలు, నాణ్యతా ప్రమాణాలు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బీ వెంకటేశ్వర్లు, పెడియాట్రిక్ వైద్యులు, సూర్యపోగు మేరి తదితరులున్నారు.

171
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles