గిరిజన గ్రామాల్లో పనులు త్వరగా పూర్తిచేయాలి..

Fri,November 8, 2019 01:19 AM

ఖమ్మం, నమస్తే తెలంగాణ : అటవీ హక్కుల చట్టం నియమ నిబంధనల మేరకు గిరిజనుల ప్రాథమిక అవసరాలను తీర్చేందుకు చేపడ్తున్న పనులపై సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జరిగిన అటవీ హక్కుల చట్టం జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వీపీ గౌతమ్‌తో కలిసి సంబంధిత శాఖల ద్వారా గిరిజనుల అభివృద్ధికోసం చేపడు తున్న పనుల పురోగతి, అటవీశాఖ అనుమతుల పెండింగ్ అ జెండా అంశాలపై సమీక్షించారు. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా పెనుబల్లి, సింగరేణి, కొణిజర్ల, రఘునాథపాలెం మండలాల్లో చేపడుతున్న బీటీ రోడ్డు పనులు, సింగరేణి మండలంలో శ్మశాన వాటికల స్థలాలకోసం ఎంపీడీవోల ద్వారా ప్రతిపాదించబడిన అటవీ శాఖ భూముల కేటా యింపు, మధిర ఫారెస్ట్ రేంజ్ పరిధిలో మిషన్ భగీరథ పైప్‌లైన్ పనులు, సింగ రేణి మండలంలో వ్యక్తిగత పట్టాల జారీ అజెండా అంశాలలోని పెండింగ్ పనులపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో నివసించే గిరిజను లకు కనీస అవసరాలు కల్పించేందుకు గ్రామ సభ తీర్మానం ప్రకారం పనులను త్వరగా పూర్తి చేసే దిశగా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

అటవీ హక్కుల చట్టం క్రింద ప్రభుత్వం గిరిజనులకు కల్పిస్తున్న సదు పాయాలను కల్పించేందుకు చేపడ్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, అటవీ పరిసర ప్రాంతాలలో నివసి స్తున్న గిరిజనులకు అటవీ హక్కుల చట్టం వర్తిస్తుందని, అటవీ శాఖ వద్ద క్లియరెన్స్ కొరకు పెం డింగ్‌లో ఉన్న పనులకు సంబంధించి అటవీ హక్కు ల చట్టం, నియమ నిబంధనల మేరకు అవసరమైన స్థ ల కేటాయింపు క్లియరెన్స్ పనులపై సత్వరమే సం పూర్ణ వివరా లతో నివేదిక సమర్పించాలని అటవీ శాఖాధికారిని కలెక్టర్ సూ చించారు. సామాజిక అవసరాలకు సంబంధించి గిరిజన ప్రాంతాలలో శ్మశాన వాటికలు, వ్యర్థ పదార్థాలు తొలగింపు కేంద్రాలకు అవసరమైన స్థలాల కేటాయిం పులకు సంబంధించి ఎంపీడీవోల ద్వారా ప్రతిపాదించబడిన స్థలాల కేటాయిం పునకు సత్వరమే చర్యలు తీసుకొని వారం రోజులలోపు తదుపరి కమిటీ సమావేశంలో ఆమోదం పొందాలని కలెక్టర్ సూచించారు. జాయింట్ కలెక్టర్ అనురాగ్ జయంతి, శిక్షణా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా అటవీ శాఖాధికారి ప్రవీణ, సింగరేణి జడ్పీటీసీ వి జగన్, గిరిజన సంక్షేమశాఖ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీరు ఎస్ రాములు, సత్తుపల్లి ఎఫ్‌డీవో వీ సతీష్‌కుమార్, కల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారి శివాజి, కొణిజర్ల ఎంపీడీవో ఎంవీ రమణ, ఫారెస్ట్ రేంజ్ అధికారులు ఎం లక్ష్మణ్‌రెడ్డి, ఎస్ విజయలక్ష్మీ, బీ రాధిక సమావేశంలో పాల్గొన్నారు.

160
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles