సింగరేణి ప్యాసింజర్ రైల్ సర్వీస్ పునరుద్ధరణ

Fri,November 8, 2019 01:18 AM

ఖమ్మం నమస్తేతెలంగాణ: కొత్తగూడెం -సిర్పూర్ కాగజ్‌నగర్ వరకు సింగరేణి ప్యాసింజర్ రైల్ సర్వీస్ ఖమ్మం ఎంపీ, టీఆర్‌ఎస్ లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు కృషితో తిరిగి ప్రారంభమవుతుంది. ఈ విషయాన్ని దక్షిణ మ ధ్య రైల్వే జీఎం గజానన్ మాల్య ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఫోన్ ద్వారా సమాచారం అం దించారు. గత కొద్ది నెలల క్రితం దశాబ్దాల చరిత్ర ఉన్న రైలును రద్దు చేసి పుష్‌ఫుల్ రైలును ప్రారంభించిన విషయం పాఠకులకు విదితమే.ఈ రైలు వలన కొత్తగూడెం నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్ వరకు వెల్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.12 బోగీలు గల ఈ పుష్‌ఫుల్ రైలులో బాత్రూమ్ ఒకటే ఉండటం వలన మహిళలు, రో గులు, పెద్ద వారు, పిల్లలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.ప్రయాణికులు తాము పడుతున్న ఉబ్బందులను ఖమ్మం ఎంపీ నామా దృష్టికి తీసుకరాగా వెంటనే సంబంధిత కేంద్ర రైల్వే శాఖ మంత్రికి, దక్షిణ మధ్య రైల్వే జీఎంకు లేఖరాశారు.

అదేవిధంగా ఈ విషయంపై నామా దక్షిణ మధ్య రైల్వే జీఎంతో చర్చించడంతో పాటుగా గత నెల రైల్ నిలయం, సికింద్రాబాద్‌లో ఎంపీలతో జరిగిన సమావేశంలో నామా ఈ సమస్య గూర్చి లేవనెత్తడం జరిగింది.నేడు ఎంపీ నామా కృషి వలన సింగరేణి ఫ్యాసింజర్ రైలును పునః ప్రారంభించడానికి రైల్వే అధికారులు సుముఖత వ్యక్తం చేసి ఈ శుక్రవారం నుంచి ప్రారంభించనున్నారు. ప్రస్తుతం 14 కోచ్‌లతో నడపడంతో పాటుగా ప్రతి కోచ్‌కు బాత్రూంలు, ప్రయాణికులు సామగ్రిని పెట్టుకో వడానికి సదుపాయం ఉంటుందని తెలిపారు.సింగరేణి ప్రాంతాలను కలుపుకుంటూ వెల్లే ఈ ప్యాసింజర్ రైలులో సింగరేణి కుటుంబాలు, పరిసర ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకునే రైతు కులుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. నామా కృషి ఫలితంగా సింగరేణి రైలు పునః ప్రారంభించడాన్ని కొత్తగూడెం పరిసర ప్రాం తాల ప్రజలు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

167
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles