మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్

Sun,November 3, 2019 11:47 PM

ఖమ్మం, నమస్తే తెలంగాణ : మహాత్మాగాంధీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని భావితరాలకు వారి స్ఫూర్తిని అందించేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. ఖమ్మం నగరం త్రీటౌన్ ప్రాంతంలోని గాంధీనగర్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన కార్య క్రమంలో రాష్ట్ర మంత్రి మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మంత్రి మా ట్లాడుతూ ఈ సంవత్సరం అక్టోబర్ 2 న మహాత్మా గాంధీ 150 వ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నా మన్నారు. 150వ జయంతిని పురస్క రించుకుని ఖమ్మం నగరంలోని గాంధీచౌక్, గాంధీనగర్‌లో మహాత్మాగాంధీ విగ్రహాలను ఆవిష్కరించు కోవ డం మంచి పరిణామమన్నారు. మహాత్మగాంధీ 150వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నివారించే కార్యక్రమం ప్రారంభ మైందని మన రాష్ట్రంతో పాటు మన జిల్లా, నియోజకవర్గం, ఖమ్మం నగరం ప్రజల్లో కూడా గట్టి సంకల్పం రావాలని ప్రజల భాగస్వామ్యంతోనే అన్ని కార్య క్రమాలు విజయవంతమవుతాయన్నారు. దేశవ్యాప్తంగా తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించి ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నివారించాలన్నారు.

దీనితోపాటు తమ ఇంటిని, ఇంటి పరిసరాలను పరిశు భ్రంగా ఉంచుకోవాలని కార్పొరేషన్ ద్వారా చేపడ్తున్న పారిశుధ్య కార్యక్రమాలకు సహకరించి తడి, పొడి చెత్తను వేర్వేరుగా ఉంచాలని తడిచెత్తను ఎరువుగా మార్చుకునే అవకాశం ఉందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఖమ్మం నియోజకవర్గంతో పాటు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలో భాగంగా ప్రధాన కూడళ్లను అభివృద్ధ్ది పరిచి నగరంలోని ప్రతి డివిజన్‌లో ఎల్‌ఈడీ విద్యుత్ బల్పులను ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. రాబోయే కాలంలో నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ అంకిత భావంతో సేవలందించేందుకు ప్రజాప్రతినిధులందరూ తమ బాధ్యతను నిర్వర్తిస్తారని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ప్లాస్టిక్ వినియోగం నిషేధం పై మంత్రి ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజు, నగర మేయర్ డాక్టర్ పాపాలాల్, డిప్యూటీ మేయర్ బత్తుల మురళీప్రసాద్, 44వ డివిజన్ కార్పొరేటర్ తోట ఉమారాణి, జాయింట్ కలెక్టర్ అనురాగ్ జయంతి, నగర పాలక సంస్థ కమిషనర్ జే శ్రీనివాసరావు, అర్బన్ తహసీల్దారు రాంమూర్తి, కార్పొరేటర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

195
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles