ఎంపీ నామా చొరవతో సమస్యలు పరిష్కారం

Fri,November 1, 2019 11:41 PM

ఖమ్మం నమస్తేతెలంగాణ: పెనుబల్లి మండలంలో రైతుల పాస్‌పుస్తకాల సమస్య, ఇతర సమస్యలు ఖమ్మం లోక్‌సభలో టీఆర్‌ఎస్ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కృషితో పరిష్కారానికి నోచుకున్నాయి.బుధవారం, గురువారం ఖమ్మం జిల్లాలో పర్యటన సందర్భంగా పలు సమస్యలను ప్రజలు ఎంపీ దృష్టికి తీసుకవచ్చారు. వచ్చిన వాటి గురించి కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌లతో మాట్లాడి అక్కడి అక్కడే సమస్యలు పరిష్కరించారు. ఈ సందర్భంగా పెనుబల్లి మండలానికి చెందిన సుమారు 700 ల మంది రైతులకు చెందిన పట్టాదారు పాస్‌పుస్తకాలు చాలా కా లంగా పంపిణీ చేయకుండా అధికారులు పెండింగ్‌లో పెట్టారు.

ఈ విషయం ఎంపీ నామా దృష్టికి వచ్చింది. రైతులు రాతపూర్వకంగా దరఖాస్తు ఇచ్చారు. వెంటనే జాయింట్ కలెక్టర్‌తో మాట్లాడటంతో పాటు సమస్య పరిష్కారం చేయాలని లేఖ పంపించడం జరిగింది. తక్షణ పరిష్కారానికి నామాకు జేసీ హామీ ఇచ్చారు. కొణిజర్ల మండలానికి చెందిన ఒక గిరిజన మహిళ స మస్యను దృష్టికి తీసుకు వచ్చింది. వెంటనే అక్కడి నుంచేజిల్లా పంచాయతీ అధికారితో సమస్య పరిష్కారానికి కృషి చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి గుండాలకు చెందిన రైతులు తమ సమస్యలు గురించి నామాను కలిసి వినతి ఇచ్చారు. ఈ విషయమై వెంటనే అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు.

218
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles