పట్టణ పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి..

Mon,October 21, 2019 01:10 AM

సత్తుపల్లి మునిసిపాలిటీ పారిశుధ్యంపై ఇటీవల మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారని, ఈ సమీక్షలో మునిసిపాలిటీలో అదనపు సిబ్బందిని నియమించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందన్నారు. మునిసిపల్ సిబ్బంది, కార్యాలయ సిబ్బందిని నియమించుకుని పట్టణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. గతంలో మిగిలిపోయిన పనులకు కూడా రూ.20కోట్లు మంజూరుకు అనుమతి లభించిందని, త్వరలోనే ఆ పనులు కూడా పూర్తిచేస్తామన్నారు. పల్లెప్రగతి మాదిరిగానే పట్టణ ప్రగతి కూడా త్వరలోనే ప్రారంభించి పట్టణాన్ని సుందరంగా తీర్చి దిద్దనున్నట్లు ఆయన తెలిపారు.

ఇసుక కొరత వల్ల పట్టణంలో కొన్ని అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, త్వరలోనే వాటిని కూడా పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు దొడ్డా హైమావతి శంకర్ రావు, పగుట్ల వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, వైస్ ఎంపీపీ దాసరి వెంకట్రామిరెడ్డి(చిట్టినాయన), చల్లగుళ్ల నర్సింహా రావు, చల్లగుళ్ల కృష్ణయ్య, చలసాని సాంబశివరావు, కొత్తూరు ఉమా మహేశ్వరరావు, కూసంపూడి మహేష్, అద్దంకి అనిల్, షేక్ చాంద్ పాషా, బొమ్మారెడ్డి విజయ్‌కుమార్‌రెడ్డి, వల్లభనేని పవన్, అమరవరపు కృష్ణారావు, మోరంపూడి ప్రసాద్, మల్లూరు అంకమరాజు, కంచర్ల నాగేశ్వరరావు, కర్నాటి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

232
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles