మద్యం దుకాణాల కోసం పోటాపోటీ

Wed,October 16, 2019 01:00 AM

ఖమ్మం క్రైం : మద్యం దుకాణాల దరఖాస్తులకు వ్యాపారస్తులు పోటీలు పడుతున్నారు. నూతన మద్యం పాలసీలో నిబంధనలను సరళతరం చేసిన ప్రభుత్వం దుకాణాల నిర్వహణలో వ్యాపారులకు బంఫర్ ఆఫర్‌లను ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం పాలసీ విధానాలలో మార్పులు చేయడంతో ప్రతి ఒక్కరూ మద్యం షాపులను దక్కించుకునేందుకు ఉత్సహాంగా ముందుకు వస్తున్నారు. దరఖాస్తుతో పాటు అఫిడవిట్‌ను జతచేయాలనే నిబంధనలను తొలగించి క్లస్టర్ విధానాన్ని అమలు చేయబోతున్న తరుణంలో వ్యాపారులకు ఇది సువర్ణ అవకాశం కావడంతో జిల్లాలో పలువురు వర్తకలు మద్యం షాపుల కోసం దరఖాస్తులు చేసుకోవడంలో ఆసక్తి చూపుతున్నారు. గతంలో డివిజన్, వార్డుల వారిగా వైన్‌షాపులు ఇవ్వడంతో వ్యాపార రంగాల్లో కొంత నష్టం, దాంతో పాటు వైన్ షాపులకు అద్దెకు ఇవ్వడంలో యాజమానులు అద్దెలను విపరీతంగా పెంచారు. దీంతో షాపు దక్కించుకున్న దుకాణాదారులకు ఆశాజనకం లేకపోవడంతో కొంత నిరుత్సాహానికి గురయ్యారు. సెప్టెంబర్ 30 కల్లా జిల్లాలో మద్యం దుకాణాల లైసెన్స్ గడువు ముగించే నేపథ్యంలో ప్రభుత్వం నూతన మద్యం పాలసీ ద్వారా కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఆ విధానంలో ప్రతి ఒక్కరూ మద్యం షాపుల వ్యాపారాలకు ముందుకు రావాడానికి కొన్ని నియమనిబంధనలు తొలగించారు. దాంతో వ్యాపారస్తులకు కొంత అర్థిక బడ్డన తగ్గడంతో ప్రస్తుతం జిల్లాలో ఉన్న నూతన వ్యాపారస్తులు ముందుకు వస్తున్నారు. గతంలో దరఖాస్తు ఫీజు రూ. లక్ష నిర్ణయించారు. ప్రస్తుతం అదే పీజును మరో లక్షను పెంచుతూ రూ. 2 లక్షలుగా చేశారు. అయినప్పటికి జిల్లాలో దరఖాస్తుల దఖాలల స్వీకరణ జిల్లాలో రోజురోజుకు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. జిల్లాలో ఈ నెల 9వ తేదీన ప్రారంభమైన మద్యం టెండర్ ప్రక్రియ ఏడు రోజులు గడుస్తున్న నేపథ్యంలో మంగళవారం అధికారులకు ఊహకు అందని విధంగా దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల స్వీకరణ ఇంకా ఒక్కరోజు ఉన్న నేపథ్యంలో బుధవారం కూడా అదే తరహాలో దరఖాస్తులు రావచ్చు అని అధికారులు తెలుపుతున్నారు.

ఏడో రోజు 1226 దరఖాస్తులు..
జిల్లాలో ఏడు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 89 షాపుల కేటాయింపు కోసం ఎక్సైజ్ అధికారులు దరఖాస్తులకు ఈ నెల 9 వ తేదీ నుంచి దరఖాస్తులకు ఆహ్వానించారు. మొదటి రోజునే ఎక్సైజ్ బోణీ అదిరింది. ఆ రోజు 50 దరఖాస్తులు రాగా మరుసటి రోజు 34 దరఖాస్తులు వచ్చాయి. అలా నాలుగు రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ మందకోడిగా సాగింది. ఐదో రోజు ఆదివారం కావడంతో ఆ రోజు మినహించారు. సోమవారం ఆరోవ రోజు 1213 దరఖాస్తులు రాగా మంగళవారం మాత్రం 1226 దరఖాస్తులు నమోదు కావడంతో రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా మొట్టమొదటి స్థానంలో నిలిచింది. నల్గొండ జిల్లాకు మంగళవారం రోజు 692 దరఖాస్తులు రావడంతో రెండోవ స్థానంలో నిలిచింది. దరఖాస్తులకు బుధవారం చివరి రోజు కావడంతో అదే మాదిరిగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. దరఖాస్తుదారులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున కౌంటర్లను పెంచే అవకాశం ఉంది. గతంలో 4029 దరఖాస్తులతో జిల్లా మొదటిస్థానంలో నిలిచింది. ఏడు స్టేషన్ల పరిధిలో ఉన్న 89 షాపులకు దరఖాస్తులు ఇలా వచ్చాయి. ఖమ్మం స్టేషన్-1 151, ఖమ్మం స్టేష న్-2 145, నేలకొండపల్లికి 216, వైరాకు 156, మధిరకు 219, సత్తుపల్లికు 251, సింగరేణికి 88 దరఖాస్తులు వచ్చాయి.

సత్తుపల్లిలో అధికంగా నమోదు
రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ ద్వారా కొన్ని నియమనిబంధనలను తెలంగాణ సర్కార్ కొన్ని సవరణలు చేసింది. ఆంధ్రాలో మద్యం షాపులను అక్కడ ఎక్సైజ్ శాఖనే నిర్వహించుకునే విధంగా చర్యలు తీసుకోవడంతో ఆ రాష్ట్రంలో ఉన్న చాలామంది వ్యాపారస్తులు జిల్లాపై కన్నువేశారు. ఆంధ్రా రాష్ర్టానికి సరిహద్దుగా ఉన్న సత్తుపల్లి స్టేషన్ పరిధిలో 15 షా పులకు 251 దరఖాస్తులు దాఖలయ్యాయి. మధిరలో 12 షా పులకు 219 దరఖాస్తులు, నేలకొండపల్లిలో 11 షాపులకు 216, వైరాలో 9 షాపులకు 156 దరఖాస్తులు, ఖమ్మం స్టేషన్-1లో 21 షాపులకు 151, ఖమ్మం స్టేషన్-2 లో 14 షాపులకు 145 దరఖాస్తులు నేటి వరకు దాఖలయ్యాయి. బుధవా రం చివరి రోజు కావడంతో 1500 ల నుంచి 2000ల దరఖాస్తులు వచ్చే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు.

ఎక్సైజ్ ఖజానాకు రూ. 48.78 కోట్లు..
జిల్లాలో నూతన మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు దరఖాస్తుదారులు చూపిస్తున్న ఉత్సాహంతో ఎక్సైజ్ ఖాజానకు నేటి వరకు 48.78 కోట్ల ఆదాయాన్ని రాబట్టుకుంది. జిల్లాలో దరఖాస్తు స్వీకరణ ఏడు రోజులలోనే ఇంత ఆదాయం రావడం కొసమెరుపు. జిల్లాలో మద్యం దుకాణాలు దక్కించుకునేందుకు వ్యాపారస్తులు ముందుకు వస్తున్న నేపథ్యంలో ఇంత ఆదాయం సమకూర్చుకున్నామని ఆధికారులు తెలుపుతున్నారు. మంగళవారం రోజు 1226 దరఖాస్తులతోనే రూ. 24.52 కోట్లు ఆదాయం వచ్చింది. గతంలో వచ్చిన దరఖాస్తులు 4029 తో రూ. 40.29 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంది. ఈసారి ఆంధ్ర రాష్ట్రం నుంచి వ్యాపారస్తులు ఎక్కువగా రావడంతో ఇంత మేర ఆదాయం లభించిందని పలువురు పేర్కొంటున్నారు. చివరి రోజున ఇంకా ఆదాయం పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒకపక్క అర్థికమాన్యం దెబ్బతిన్నదని చెబుతున్నప్పటికి ఇంత మేర ఆదాయం రావడంతో అధికారులు అశ్చర్యపోతున్నారు. దరఖాస్తుల స్వీకరణ మొదటి నుంచి మందకోడిగా సాగడంతో దరఖాస్తులు వస్తాయో లేవో అనే ఆలోచనతో ఉన్నప్పటికి మంగళవారం వచ్చిన దరఖాస్తులను చూస్తే మరింత జోష్‌ను నింపింది. ఇంతగనంగా దరఖాస్తులు చేసుకుంటున్న లక్కీడ్రా ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే.

256
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles