హింసకు కుట్ర..

Sat,October 12, 2019 11:50 PM

- ఖమ్మం, వైరాలో బస్సు అద్దాలను ధ్వంసం చేసిన దుండగులు

ఖమ్మం, నమస్తే తెలంగాణ: ఆర్టీసీ కార్మికులు సమ్మె లో ఉన్నప్పటికీ పండుగ పూట ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి ప్రజలతో శభా ష్‌ అనిపించుకుంటున్న ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రతిపక్ష పార్టీలు కుట్రలు పన్నుతున్నాయి. వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విష యం తెలిసిందే. వారి సమ్మె కారణంగా పండుగ సమయంలో ప్రజలకు ఇబ్బందులు రాకూదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. తాత్కాలి కంగా డ్రైవర్లను, కండక్టర్లను నియమించి దాదాపు 80 శాతం బస్సుల ను నడిపిస్తున్నారు. తద్వారా తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున జరుపు కునే దసరా పండుగకు ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం బస్సులు నడిపి ప్రజలతో శభాష్‌ అనిపించుకుంది. మరో వైపు ప్రజాస్వామిక హక్కులను ప్రభుత్వం కాపాడుతుంది. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు పహారాను ఏర్పాటు చేశారు. మరోవైపు తాత్కా లిక కండక్టర్లు ప్రయాణికుల నుంచి అసలు చార్జీకంటే అదనంగా వసూలు చేస్తున్నారని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం వెంటనే అప్ర మత్తమైంది. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి పోలీసులను అలర్ట్‌ చేశారు. దీంతో పలు జిల్లాలలో పోలీసు ఉన్నాతాధికారులు బస్సులల్లో తనిఖీలు నిర్వహి స్తున్నారు. ఖమ్మం నగరంలో పోలీసు కమిషనర్‌ తఫ్సీర్‌ఇక్బాల్‌ సైతం ఆర్టీసీ బస్సులలో తనిఖీలు చేపట్టారు. సమ్మె నేపథ్యంలో ప్రశాంతంగా ప్రత్యామ్నాయ చర్యలతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తున్న తరుణంలో ప్రతిపక్ష పార్టీలు వాటి అనుబంధ కార్మిక సంఘాల నేతృ త్వంలో కుట్ర పన్నుతున్నారు. శనివారం రాత్రి ఖమ్మం నగరంలోని వైరా రోడ్‌, వైరా మండలం నారపనేనిపల్లి సమీపంలో ఆర్టీసీ బస్సులపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వి అద్దాలను ధ్వసం చేశారు.

మరో వైపు ఖమ్మం బస్సు డిపోకు చెందిన దేవిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యా యత్నం చేసుకున్నారు. ఆయనను వెంటనే కుటుంబ సభ్యులు, పోలీసులు ఖమ్మంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేస్తుండగానే కొన్ని కార్మిక సంఘాలకు చెందిన నాయకులు ఆసుపత్రిలోనికి ప్రవేశించి వైద్యులను అడ్డుకున్నారు. చికిత్స చేయకుండా వైద్యులను అడ్డుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అతనికి ఏమైనా ప్రమాదం జరిగితే ప్రభుత్వంపై నిందవేసే రాజకీయ ఎత్తుగడలో భాగంగానే ప్రతిపక్ష కార్మిక సంఘాల నాయకులు వ్యవహరించడం జరిగిందని సమ్మె చేస్తున్న కార్మికులే పేర్కొనడం గమనార్హం. శ్రీనివాసరెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రభుత్వాసుపత్రుల నుంచి నగరంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించి అక్కడ నుంచి మెరుగైన చికిత్స కొరకు హైదరాబాద్‌కు తీసుకువెళ్లారు. దీనిని ఆసరాగా తీసుకుని కాంగ్రెస్‌కు చెందిన కొద్ది మంది నాయకులు ఆసుపత్రి ఎదుట ఆందోళన నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. అక్కడ నుంచి బస్టాండ్‌కు చేరుకుని అక్కడ కూడా రాస్తారోకో చేయ డంతో వాహనదారులు అనేక ఇబ్బందులకు గురయ్యారు. ప్రభుత్వ సెలవ రోజు కావడం ఉద్యోగులు, సాధారణ ప్రజలు, ప్రయాణికులు వారి ఆందోళనతో పలు ఇబ్బందులకు గురయ్యారు. ఇదే సమయంలో ఆర్టీసీకి చెందిన మరో డ్రైవర్‌ వెంకటేశ్వర్లు కూడా కలెక్టరేట్‌ ఎదురుగా కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా పోలీసులు, తోటి కార్మికులు అడ్డుకున్నారు. ఖమ్మంలో ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చెడగొట్టేలా కొన్ని వామపక్ష పార్టీల అనుబంధ సంఘాల నాయకులు కుట్రలు పన్నుతున్నారు.

నాటకీయ పరిణామాల నడుమ హైదరాబాద్‌...
ఖమ్మం డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ దేవిరెడ్డి శ్రీనివాసరెడ్డి శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో రాపర్తినగర్‌లోని తన ఇంట్లో కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో ఆ ఇంటిపక్కనే నివాసం ఉంటున్న టూటౌన్‌ ఎస్‌ఐ ఉదయ్‌కిరణ్‌ వెంటనే వెళ్లి బ్లాంకెట్‌ను కప్పి మంటలను ఆర్పారు. వెంటనే కారులో ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న వివిధ కార్మిక సంఘాల నాయకులు ప్రభుత్వాసుపత్రికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసు కున్నాయి. వైద్యులు శ్రీనివాసరెడ్డిని ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తుండగా కార్మిక సంఘాల నాయకులు వైద్యులను అడ్డుకుని చికిత్స చేయవద్దని, ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకువెళ్తామని ఆందోళనకు దిగారు. వైద్యులు చెబుతున్నప్పటికీ బలవంతంగా అతన్ని కిమ్స్‌కు తీసుకు వెళ్తామని చెప్పి బయటికి వచ్చాక మరో ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి కిమ్స్‌ ఆసుపత్రికి శ్రీనివాసరెడ్డిని తరలించారు. వైద్యులు చికిత్స చేసేందుకు సిద్ధపడుతుండటంతో అతని కుమారుడు తాను ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం చేస్తానని తన తండ్రిని హైద్రాబాద్‌లోని ఎయిర్‌ఫోర్స్‌ ఆసుపత్రికి తీసుకెళ్తానని చెప్పారు. పోలీసులు అందుకు అంగికరించి ప్రత్యేక అంబులెన్స్‌లో శ్రీనివాసరెడ్డిని హైదరాబాద్‌కు తరలించారు. అంబులెన్స్‌ వెంట కూసుమంచి ఎస్‌ఐ అశోక్‌కుమార్‌ను ప్రత్యేక పోలీస్‌ ఎస్కార్ట్‌లో హైదరాబాద్‌ పం పారు. ఖమ్మం ఏసీపీ వెంకట్రావు ఆధ్వర్యంలో పోలీసు అధికారులు బస్సుడిపో, బస్టాండ్‌, ప్రభుత్వ వైద్యశాల, వైరారోడ్‌ తదితర ప్రాంతాలలో బందోబస్తును ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.

ఆర్‌టీసీ బస్సుపై రాయితో దాడి
వైరా, నమస్తే తెలంగాణ: వైరా మండలం నారపనేనిపల్లి, విప్పలమడక గ్రామాల మధ్య శనివారం రాత్రి 7.30 గంటల సమయంలో ఆర్‌టీసీ బస్సుపై గుర్తుతెలియని ఓ ఆగంతకుడు రాయితో దాడి చేశాడు. ఏపీ16జెడ్‌0020 అనే నెంబర్‌ గల బస్సు వైరా నుంచి స్టేజీపినపాక, సిరిపురం మీదుగా నెమలి గుండా మధిర వెళ్లేందుకు ప్రయాణికులతో బయల్దేరింది. ఈ క్రమంలో నారపనేనిపల్లి, వి ప్పలమడక గ్రామాల మధ్య ద్విచ క్ర వాహనంపై వచ్చిన ఓ ఆగంతకుడు ఆర్‌టీసీ బస్సుపై రాయి విసిరాడు దాంతో డ్రైవర్‌ ముందు భాగంలోని బస్సు అద్దం పగిలిపోయింది. బస్సు డ్రైవర్‌ కోలా వేణుగోపాలరావుకు గాజు పెంకులు గుచ్చుకున్నాయి. కండక్టర్‌గా బొర్రా శివకృష్ణ విధులు నిర్వహిస్తున్నాడు. వెంటనే సమాచారం తెలుసుకున్న వైరా ఏసీపీ దాసరి ప్రసన్నకుమార్‌ ఆదేశాలతో సీఐ జెట్టి వసంతకుమార్‌ పర్యవేక్షణలో ఎస్సై నరేష్‌, పోలీస్‌ సిబ్బంది దాడికి గురైన సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. డ్రైవర్‌ వేణుగోపాలరావు, కండక్టర్‌ శివరామకృష్ణ జరిగిన సంఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులకు వివరించారు. బస్సులో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ కృష్ణా జిల్లా, ఖమ్మం జిల్లా వైరా మండలానికి చెందిన ప్రయాణికులు ఇతర వాహనాల్లో తమ ప్రాంతాలకు తరలివెళ్లారు. వైరా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

216
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles