ఔత్సాహికులకు అన్ని విధాలా ప్రోత్సాహం

Sat,October 12, 2019 11:47 PM

మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌
ఖమ్మం నమస్తే తెలంగాణ : హైదరాబాద్‌లో తొలిసారి వరల్డ్‌ డిజైన్‌ అసెంబ్లీ సమావేశాలు జరగడం సంతోషంగా ఉందని, ఔత్సాహికులను అన్ని విధాలా ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ,ఐటీ సెక్రెటరీ జయేష్‌ రంజన్‌ లు అన్నారు.శనివారం హెచ్‌ఐసీసీలో వరల్డ్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌, తెలంగాణ ప్రభుత్వం, ఇండియా డిజైన్‌ ఫోరం ఆధ్వర్యంలో రెండోరోజు వరల్డ్‌ డిజైన్‌ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐటీ రంగంలో బెంగళూరు కంటే హైదరాబాద్‌ శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. హైదరాబాద్‌లో టీ -హబ్‌, టీ-వర్క్స్‌, ఇమేజ్‌ టవర్స్‌ నిర్మాణం జరుగుతుందన్నారు. అదేవిధంగా తెలంగాణ టూరిజం కూడా వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. నేషనల్‌ డిజైన్‌ సెంటర్‌ను రాష్ట్ర ప్రభు త్వం హైదరాబాద్‌ లో ఏర్పాటు చేస్తున్నదని, హైదరాబాద్‌ గ్లోబల్‌ డిజైన్‌ డిస్టినేషన్‌ కాబోతున్నది అని మంత్రులు తెలిపారు. ఈ సందర్భంగా పద్మశ్రీ చింతకింది మల్లేశం తయారు చేసిన ఆసు యంత్రాలను చేనేత కళాకారులకు మంత్రి కేటిఆర్‌ అదజేశారు.

153
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles