పల్లె ప్రగతి దేశానికే ఆదర్శం

Sat,October 12, 2019 12:03 AM

-సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉభయజిల్లాలు సస్యశ్యామలం
-లోక్‌సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు
-అశ్వారావుపేట నియోజకవర్గంలో రూ. 5 కోట్ల అభివద్ధి పనులు ప్రారంభం

అశ్వారావుపేట, నమస్తే తెలంగాణ/అశ్వారావుపేట రూరల్: గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత లక్ష్యంగా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన 30రోజులు ప్రత్యేక పల్లె కార్యచరణ ప్రణాళిక దేశానికి ఆదర్శంగా నిలిచిందని లోకసభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో రూ. 5కోట్ల రూపాయల అభివద్ధి పనులు ప్రారంభించారు. దీనిలో భాగంగా శుక్రవారం అశ్వారావుపేట మండలంలోని బీమునిగూడెంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఐటీడీఏ, గిరిజన సంక్షేమ, ఇంజినీరింగ్‌శాఖ, ఎల్‌డబ్ల్యూఏ రూ.50లక్షల నిధులతో నిర్మించిన అదనపు గదుల భవనాన్ని స్థ్దానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, భద్రాద్రికొత్తగూడెం జడ్పీచైర్మన్ కోరం కనకయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా మన గ్రామాన్ని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలనే అవగాహన ప్రజల్లో వచ్చిందన్నారు. గ్రామాల్లో ఇదే స్ఫూర్తి కొనసాగించాలని, పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ప్రతీ నెల పంచాయతీలకు రూ. 339 కోట్లు ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. ఉభయ జిల్లాలను సస్యశామలం చేయాలనే లక్ష్యంతోనే సీతారామా ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టారని, దీంతో జిల్లాలో 4లక్షల 93వేల ఎకరాల భూమి సాగులోకి రానున్నదన్నారు.

ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని, దమ్మపేట మండలంలో భూసేకరణ కోసం ప్రకటన విడుదల చేయటం జరిగిందన్నారు. ములకలపల్లి మండల వరుకు పనులు జరిగాయని వివరించారు. అశ్వారావుపేట నియోజకవర్గాన్ని తాను దత్తత తీసుకున్నానని, మండలానికి ఒక గ్రామాన్ని తీసుకుని అభివృద్ధి చేయటానికి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఎంపీ తెలిపారు. జడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి వివిధ సమస్యలతో కూడిన వినతిప్రతాన్ని ఎంపీకి అందచేశారు. తిరుమలకుంట, వేదాంతపురం, నారాయణపురం, బీమునిగూడెం, అచ్యుతాపురం, ఉట్లపల్లి గ్రామ పంచాయతీల సమస్యలపై వినతిపత్రాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు తుళ్లూరి బ్రహ్మయ్య, జడ్పీటీసీలు చిన్నంశెట్టి వరలక్ష్మి, పైడి వెంకటేశ్వరరావు, ఎంపీపీలు జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, పార్టీ మండల అధ్యక్షుడు బండి పుల్లారావు, దొడ్డాకుల రాజేశ్వరరావు, సర్పంచ్‌లు తాటి భవాని, నాగలక్ష్మి, ఎంపీటీసీలు కాసాని దుర్గా, మారుతి లలిత, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు కాసాని వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

ములకలపల్లి మండలంలో పర్యటన..
ములకలపల్లి: ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ములకలపల్లి మండలంలో శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో కలిసి తొలుత ఆయన సీతారాంపురం పంచాయతీ వేముకుంటలో రూ.1.50కోట్లతో నిర్మించిన బీటీ రహదారికి ప్రారంభోత్సవం చేశారు. అక్కడి నుంచి ఆయన చౌటిగూడెం గ్రామపంచాయతీకి చేరుకుని చౌటిగూడెం నుంచి మూకమామిడి వరకు రూ.2.50కోట్లతో నిర్మించిన తారురోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా రోడ్డు పక్కన హరితహారంలో భాగంగా మొక్క నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నామా మాట్లాడుతూ.. ప్రభుత్వం రహదారుల ఏర్పాటు లక్ష్యంగా ముందుకెళ్తుందన్నారు. పల్లె ప్రణాళిక 30 రోజుల కార్యక్రమానికే పరిమితం కాకూడదని, ఇది నిరంతరం కొనసాగాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నామా వెంట జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఎంపీపీ మట్ల నాగమణి, జడ్పీటీసీ సున్నం నాగమణి, తహసీల్దార్ రంగాప్రసాద్, ఎంపీడీవో నాగేశ్వరరావు, డీఈ రామారావు, ఏఈలు సుబ్బరాజు, శ్రీకుమార్, ఎంపీటీసీలు వర్సా రాజు, తాటి తులసి, సర్పంచ్‌లు గొల్ల పెంటయ్య, కారం సుధీర్, గడ్డం భవాని, సున్నం సుశీల, కీసరి శ్రీను, సవలం సుజాత, బీబినేని భద్రం, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు నాగళ్ల వెంకటేశ్వరరావు, టీఆర్‌ఎస్ నాయకులు పాలకుర్తి ప్రసాద్, పర్వతనేని అమర్‌నాథ్, మోరంపూడి అప్పారావు, పువ్వాళ్ల మంగపతి, శెనగపాటి సీతారాములు పాల్గొన్నారు.

ఆరోగ్యతెలంగాణే : ఎంపీ నామా
దమ్మపేట: ఆరోగ్య తెలంగాణే సీఎం కేసీఆర్ ప్రధాన లక్ష్యమని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం దమ్మపేట మండల పరిధిలోని ఆర్లపెంట, మల్కారం గ్రామాల్లో రూ.25 లక్షలతో నిర్మించిన ఆరోగ్య ఉపకేంద్రాలను ఎంపీ నామా.. ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్యతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల బాగోగులు పట్టించుకున్న ప్రభుత్వం తెలంగాణ అని, ప్రజలందరూ ఆరోగ్యవంతంగా ఉండాలని గ్రామాల్లో సైతం ఆరోగ్య ఉపకేంద్రాలను నిర్మించిన ఘనత ఒక్క కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో ప్రజలకు వైద్యసేవలు అందించడంలో ప్రభుత్వం ఎంతో కృషిచేస్తుందని, అందులో భాగంగానే ప్రతీ ఆసుపత్రిని ఆధునీకరించడంతో పాటు కార్పొరేట్ వైద్యం అందిస్తూ వారికి అండగా నిలిచిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఆరోగ్య ఉపకేంద్రాలను ఉపయోగించుకుని వైద్యసేవలు పొందాలని కోరారు. అనంతరం ఆర్లపెంట గ్రామంలో హరితహారంలో భాగంగా కొబ్బరి మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సోయం ప్రసాద్, జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, వైస్ ఎంపీపీ దారా మల్లికార్జునరావు, దమ్మపేట, ఆర్లపెంట, నాగప్రసాద్, యార్లగడ్డ బాబు, టీఆర్‌ఎస్ ప్రచార కార్యదర్శి గొట్టిపర్తి యోగానంద్(నందం), అబ్దుల్ జిన్నా, రెడ్డిమళ్ల చిట్టినాయన, మాజీ ఎంపీపీ అల్లం వెంకమ్మ తదితరులు పాల్గొన్నారు.

211
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles