నేడు ఎంఈఓలతో డీఈఓ సమీక్ష సమావేశం

Thu,October 10, 2019 12:28 AM

ఖమ్మం ఎడ్యుకేషన్,అక్టోబర్9: ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నిర్వహణ, ప్రభుత్వ లక్ష్యాలు పలు అంశాలపై సమీక్షించేందుకు గురువారం డీఈఓ కార్యాలయంలో మండల విద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. 16 అంశాలపై సమీక్ష జరిపేందుకు అజెండాను రూపొందించి ఆ వివరాలతో హాజరుకావాలని మంగళవారమే సమాచారం ఇచ్చారు. విద్యాసంవత్సరం ప్రారంభంలో తొలిసారిగా జూలై4న సమావేశం నిర్వహించగా, ఇప్పుడు రెండోసారి సమావేశం జరగనుంది. విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి సారించిన కలెక్టర్ ప్రతి శనివారం సమీక్ష నిర్వహిస్తున్నారు. కలెక్టర్ సూచించే సలహాలతో పాటు విద్యాశాఖపై వస్తున్న వినతులు, సమస్యలకు పరిష్కారించేలా సమీక్షకు సన్నద్ధ్దమవుతున్నట్లు తెలుస్తుంది. జిల్లాలోని 21 మండలాల్లోని ఎంఈఓలు, అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న వారు ఆయా మండలాల వివరాలతో రావాలని ఆదేశించారు. ప్రధానంగా విద్యావలంటీర్ల గౌరవ వేతనం, మధ్యాహ్న భోజనం నిధులు విడుదల, లాంగ్ లీవ్ టీచర్స్, ప్లాస్టిక్ నియంత్రణ, టీ హాజరు, ప్రైవేట్ స్కూల్స్ అనుమతులు, టీచర్స్ ఐడెంటీ కార్డ్స్ పెండింగ్ వంటి అంశాలపై చర్చించనున్నారు.

221
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles