మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ

Thu,October 10, 2019 12:28 AM

ఖమ్మం క్రైం, అక్టోబర్ 9 : నూతన మద్యం పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేయడంతో జిల్లాలోని 89 మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఆబ్కారీ శాఖ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. నూతన మద్యం పాలసీలో దరఖాస్తు ఫీజు రూ. 2లక్ష ఉన్న కూడాదుకాణాలకు బోణి జరిగింది. గతంలో దరఖాస్తు ఫీజు రూ లక్ష ఉంటే మొదటి రోజు దరఖాస్తులు రాలేదు. జిల్లాలో మద్యం పాపులను దక్కించుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని ఖమ్మం-1, ఖమ్మం-2, నేలకొండపల్లి, మధిర, సత్తుపల్లి, సింగరేణి, వైరా పాంత్రాలలో ఉన్న దుకాణాలకు నూతన లైసెన్స్ దరఖాస్తులను బుధవారం ఖమ్మంలో స్వీకరించారు. నేలకొండపల్లి, మధిర, సత్తుపల్లి, వైరా ప్రాంతాలలో ఉన్న షాపులకు ఖమ్మం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో, ఖమ్మం-1, ఖమ్మం-2, సింగరేణి చెందిన షావులకు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఖమ్మం-1 లో డ్రాఫ్ట్ట్ బాక్సులను ఏర్పాటు చేశారు.

మొదటి రోజు ఖమ్మం-1 ప్రాంతాంలో 21 షాపులు ఉండగా 8, ఖమ్మం -2 ప్రాంతంలో 14 షాపులకు 6, నేలకొండపల్లి మండలంలోని 11 షాపులకు 5, మధిరలో 12 షాపులకు 6, సత్తుపల్లిలో 15 షాపులకు 9, సింగరేణిలో 07 షాపులకు 6, వైరా 09 షాపులకు దరఖాస్తులు వచ్చాయి. కామేపల్లి మండంలో ఉన్న రెండు ఏజెన్సీ దుకాణాలకు, ఏన్కూర్‌లోని రెండు షాపులకు దరఖాస్తులు వేశారు. రఘనాథపాలెంలో ఈ ఏడాది నూతన షాపు మంజూరైంది. ఈ షాపు కూడా దరఖాస్తు చేస్తుకున్నందుకు ఉత్సాహం చూపించారు. చేస్తుకున్నారు. నూతన మద్యం పాలసీలో ఈ సారి ప్రభుత్వం ఈఎండీని తొలగించడంతో ఈ ఏడాది దరఖాస్తులు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఉదయం 10 గంటలకు ప్రాంభమైన ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. ఈ ప్రక్రియను జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ సోమిరెడ్డి పర్యవేక్షించారు. ఖమ్మం స్టేషన్-1లో ఎక్సైస్ సీఐ రాజు, సీఐలు జయశ్రీ, జుల్ఫిఖర్ అహ్మద్ తదితరులుపరిశీలించారు.

రెండో రోజు కూడా పెరిగే అవకాశం..
నూతన మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఎక్సైజ్ శాఖ అధికారులు నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ రెండు రోజు దరఖాస్తులు ఎక్కవగా వచ్చే అవకాశాలున్నాయి. మద్యం వ్యాపారులు మంచి రోజులు కూడా చుస్తున్నారు. దరఖాస్తులు సమర్పించేందుకు సదరు వ్యాపారులు పండితులను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పేరు గ్రహబలం కూడా చూస్తున్నారు. మొదటి రోజు దరఖాస్తులకు ఎక్కువగా యువకులు ఉన్నారు. దసరా తర్వాత అన్ని మంచి రోజులు ఉన్నాయి. దీంతో జిల్లా ఉన్న ప్రతి షాపులకు దరఖాస్తులు వచ్చే అవకాశం మెండుగా కనిపిస్తుంది. ప్రసుత్తం షావులు నడిపిస్తున్న మద్యం వ్యాపారులు మొదటి రోజు దరఖాస్తు చేయలేదు.

216
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles