గ్రామాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి : ఎమ్మెల్యే సండ్ర

Thu,October 10, 2019 12:28 AM

సత్తుపల్లి, నమస్తే తెలంగాణ, అక్టోబరు 9 : మండల పరిధి కిష్టారం గ్రామ సింగరేణి ఓసీ నిర్వాసిత గ్రామం పూర్తిగా నష్టపోయిందని, అలాంటి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తనవంతు శాయశక్తులా కృషి చేస్తానని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. గ్రామ ఎస్సీ కాలనీలో రూ. 55 లక్షల వ్యయంతో తలపెట్టిన సీసీ రోడ్లకు బుధవారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. గ్రామంలో మట్టిరోడ్లు లేకుండా ప్రతి అంతర్గత రహదారిని సీసీ రోడ్లుగా మారుస్తామన్నారు. సింగరేణి మినరల్ డవలప్‌మెంట్ ఫండ్ ద్వారా వచ్చిన నిధుల్లో అత్యధిక శాతం పూర్తిస్థాయిలో నష్టపోయిన కిష్టారం గ్రామానికే కేటాయిస్తామన్నారు. గ్రామంలో అంతర్గత రహదారులు, సైడ్‌డ్రైన్లను పూర్తిస్థాయిలో నిర్మించి సింగరేణి జీఎం కార్యాలయం కూడా కిష్టారంలోనే ఏర్పాటు చేసి అత్యాధునిక ఆసుపత్రి నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. త్వరలో సింగరేణి వ్యాప్తంగా ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి సమావేశం ఉందని ఆ సమావేశంలో గ్రామసమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళతామన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రణాళికలో ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా కష్టపడ్డారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డా హైమావతి శంకర్‌రావు, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, సర్పంచ్ శెట్టిమాల రేణుకాఈశ్వర్, ఎంపీటీసీ పాలకుర్తి సునీతారాజు, నాయకులు చల్లగుళ్ల నర్సింహారావు, కొత్తూరు ఉమామహేశ్వరరావు, ముక్కెర భూపాల్‌రెడ్డి, మామిళ్లపల్లి కృష్ణయ్య, ఉపసర్పంచ్ కొలపనేని ధనుంజయరావు, జువ్వాజి అప్పారావు, కొడిమెల అప్పారావు, నరుకుళ్ల అప్పారావు, ములకలపాటి విష్ణు, భిక్షపతిలతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

218
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles