జిల్లాలో అన్ని ప్రాంతాలకూ బస్సులు నడుపుతున్నాం

Thu,October 10, 2019 12:07 AM

-కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్
నమస్తే తెలంగాణ, అక్టోబర్ 9 : జిల్లాలో ఆర్‌టీసీ సమ్మె వల్ల ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా జిల్లాలోని అన్ని ప్రాంతాలకూ బస్సులు నడుపుతున్నామని కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ఆర్‌టీసీ, రవాణా, పోలీసు అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పోలీస్, రవాణాశాఖ అధికారుల సహకారంతో 85శాతం బస్సులను నడుపుతున్నామని తెలిపారు. అధిక చార్జీలు వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు భవిష్యత్తులో వారిని ప్రభుత్వ నియామకాలకు అనర్హులుగా ప్రకటిస్తామన్నారు. ఆర్‌టీసీ బస్సులకు నష్టం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి బస్ డిపో, బస్టాండ్‌ల వద్ద వెంటనే సీసీ కెమెరాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఆర్‌టీసీ సమ్మెతో ప్రజలకు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకూడదన్న ఉద్దేశంతో బస్సులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు, వికాలంగులకు, సినియర్ సిటిజన్‌లకు ఇతర కేటగిరి వారికి ఉన్న బస్ రాయితీ పాస్‌లను అనుమతిస్తున్నామన్నారు. ప్రతీ బస్సులో చార్జీల పట్టిక ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఏదైనా అసౌకర్యం ఏర్పడితే వెంటనే 94419119910 నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. అడిషనల్ డీసీపీ దాసరి మురళిధర్, ఆర్‌ఎం కృష్ణమూర్తి, ఆర్‌టీవో కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

185
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles