వైరాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Tue,October 8, 2019 12:43 AM

-అలరించిన కోలాట నృత్యాలు
వైరా, నమస్తే తెలంగాణ : వైరాతో పాటు మండలంలోని గ్రామాల్లో సోమవారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. వైరాలోని శ్రీకోదండ రామాలయం, సాయినగర్‌లో ఉన్న సాయి మందిరం, శ్రీమహాలక్ష్మి అమ్మవారి దేవాలయం, లీలాసుందరయ్యనగర్‌లో బతుకమ్మ సంబరాలను మహిళలు కన్నుల పండుగగా నిర్వహించారు. లీలాసుందరయ్యనగర్‌లో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు సీఎల్పీ నేత మల్లు భట్టీవిక్రమార్క సతీమణి, అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని ముఖ్య అతిధిగా హాజరై బతుకమ్మలకు గౌరీపూజ చేశారు. అనంతరం మహిళలు బతుకమ్మ ఆడి పాటలు పాడి కోలాట నృత్యాలు చేశారు. బతుకమ్మ సంబరాలతో ఆయా దేవాలయాల వద్ద కోలాహలం నెలకొంది. వైరాలోని శ్రీకోదండ రామాలయంతో పాటు ఇతర దేవాలయాల్లో మహిళలు బతుకమ్మ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలను ఆయా దేవాలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.

కొణిజర్ల మండలంలో బతుకమ్మ వేడుకలు
కొణిజర్ల : బతుకమ్మ వేడుకల్లో చివరిరోజైన సద్దుల బతుకమ్మ వేడుకను మండల వ్యాప్తంగా ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. మహిళలు, చిన్నారులు, యువతులు అధికసంఖ్యలో కోలాట నృత్యాలతో వేడుకలు నిర్వహించారు.

249
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles