గ్యాస్ సిలిండర్ పేలి ఐదుగురికి తీవ్రగాయాలు

Mon,October 7, 2019 12:57 AM

కామేపల్లి/ ఖమ్మం మయూరిసెంటర్ : ప్రమాదవశాత్తు ఇంట్లో వంట గ్యాస్‌సిలిండర్ పేలిన ఘటనలో ఐదుగురికి తీవ్రగాయాలైన సంఘటన ఆదివారం తెల్లవారుజామున కొమ్మినేపల్లి గ్రామంలో చోటుచేసుకున్నది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బోయినపల్లి ఉపేంద్రమ్మ తన చిన్న కూతురు వంగా నాగమణి, పెద్ద కుతూర్ల కుమారులు పల్లె నగేష్, మండా వినయ్, శ్రీనాథ్‌తో కలిసి శనివారం రాత్రి ఆమె నివాసంలో నిద్రిస్తున్నది. ఆదివారం తెల్లవారుజామున 4గంటల సమయంలో వంట గ్యాస్ లీకు కావడంతో గదిలో గ్యాస్ వాసన వస్తుందని నగేష్ నిద్రలేచి లైట్ వేశాడు. అప్పటికే గ్యాస్ గదినిండా గ్యాస్ వ్యాపించి ఉండడంతో ఒక్కసారిగా భారీ శబ్ధంతో మంటలు వచ్చాయి. నిద్రిస్తున్న గది, వంట గది ఒక్కటే కావడంతో భారీ ప్రమాదం చోటు చేసుకున్నది. ప్రమాదంలో ఇంట్లో నిద్రిస్తున్న ఐదుగురికి శరీరం కాలి తీవ్రగాయాలవ్వగా, పేలుడుకి డాబా ఇళ్లు పూర్తిగా ధ్వసంమైంది. స్థానికులు వెంటనే చికిత్సకు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

బాధితులను పరామర్శించిన జడ్పీచైర్మన్, ఎమ్మెల్యే...
కొమ్మినేపల్లిలో ప్రమాదవశాత్తు సిలిండర్ పేలి ఐదుగురికి తీవ్రగాయాలైన సంఘటన తెలుసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జడ్పీచైర్మన్ కోరం కనకయ్య, ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న బాధితులను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని సూపరింటెండెంట్‌ను అడిగి తెలుసుకున్నారు. నగేష్ పరిస్థితి విషమంగా ఉందని తెలపడంతో మెరుగైన వైద్యం కోసం వెంటనే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌కు ఫోన్ ద్వారా సమాచారం తెలిపి బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు హైదారాబాద్‌కు తరలించారు. వారి వెంట టీఆర్‌ఎస్ నాయకులు ధనియాకుల హనుమంతరావు, మేకల మల్లిబాబుయాదవ్, దండగల భద్రయ్య, కొమ్మినేని శ్రీనివాసరావు, బానోత్ నరసింహానాయక్, అంతోటి అచ్చయ్య, మల్లెంపాటి శ్రీనివాసరావు తదితరులున్నారు.

255
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles