సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

Mon,October 7, 2019 12:57 AM

ముదిగొండ: ఉమ్మడి ఆంధ్ర పాలకుల పరిపాలనలో బతుకమ్మ పండుగ ఎలా ఉంటుందో ప్రజలకు తెలియకుండా విస్మరించారని ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ పండుగ నిలించిందని జడ్పీచైర్మన్ లింగాల కమల్‌రాజ్ అన్నారు. ఆదివారం రాత్రి మండలపరిధిలోని కమలాపురం, అయ్యగారి పల్లి గ్రామాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జడ్పీచైర్మన్ మాట్లాడుతూ తెలంగాణలో సీఎం కేసీఆర్ బతుకమ్మ పండుగ విషిష్టతలు, విలువలు దేశానికి ఖ్యాతిని ఘనంగా ఇనుమడింప చేస్తున్నారన్నారు. గతంలో బతుకమ్మ పర్వదినం అంటే ఉమ్మడి ఆంధ్రా పాలకులు అవహేలన చేసేవారని తెలంగాణ రాష్ట్ర అవతరణ పుణ్యమా అంటూ బతుకమ్మ కీర్తి ప్రతిష్టలు నలు దిశలా వ్యాపిస్తున్నాయని ఆయన కొడియాడారు. విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు మాట్లాడుతూ బతుకమ్మ పండుగను తెలంగాణాలో ఆడపడుచులకు గౌరవ ప్రతిష్టలు పెరిగే విదంగా కేసీఆర్ తగు చర్యలు తీసుకున్నారని ఆయన అన్నారు. కమలాపురంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించిన నిర్వాహకులు బత్తుల వీరారెడ్డిని అభినందించారు హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో బిజీగా ఉన్నా తాము హాజరయ్యామని తెలిపారు.

మొదట స్థానిక బస్టాండ్ సెంటర్ నుంచి హైస్కూల్ వరకూ బతుకమ్మ నెత్తుకుని పాటలతో ఆడుతూ పాడుతూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మహిళలతో కలిసి కమల్‌రాజ్, కొండబాల కోటేశ్వరరావు సద్దుల బతుకమ్మ వద్ద ఆటపాటలతో నృత్యాలు చేశారు. ఈ సందర్బంగా చిన్నారి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షడు మీగడ శ్రీనివాస్ యాదవ్, జడ్పీటీసీ పసుపులేటి దుర్గ, ఏఎంసీ వైస్ చైర్మన్ అనంతరెడ్డి, టీఆర్‌ఎస్ మండల నాయకులు, ఎర్ర వెంకన్న, పసుపులేటి వెంకట్, తోట ధర్మరావు, రఫీ, చంద్రయ్య, దేవరపల్లి వెంకటనారాయణ రెడ్డి, మరికంటి గురుమూర్తి, గడ్డం వెంకటి టీఆర్‌ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మరికంటి శ్రీనివాసరావు, నాయకులు బొజ్జ లక్ష్మయ్య, దేవరపల్లి రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

238
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles