పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి

Mon,October 7, 2019 12:56 AM

-మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే రాములునాయక్
వైరా నమస్తే తెలంగాణ : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. మండలంలోని తాటిపూడిలో డెంగ్యూతో మృతి చెందిన కుటుంబాలను ఎమ్మెల్యే ఆదివారం పరామర్శించారు. తాటిపూడిలో డెంగ్యూతో మృతి చెందిన పిడియాల యశోధ, ఇలారపు వెంకటక్రిష్ణ, కాంపెల్లి క్రిష్ణ, ఇండ్ల మరియమ్మ, కాంపెల్లి నారాయణ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. మృతుల చిత్రపటాలకు రాములునాయక్ పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలోని ప్రతి వీధి తిరిగి అపరిశుభ్రంగా ఉన్న డ్రైనేజీలను వెంటనే పరిశుభ్రపరచాలని గ్రామ సర్పంచ్ బట్టా పెద్ద భద్రయ్యతో పాటు గ్రామ కార్యదర్శిని ఆదేశించారు. అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాల్లో ఇళ్ల వారికి పంచాయతీ ఆధ్వర్యంలో నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. గ్రామంలో నిర్వహించిన మెడికల్ క్యాంపును ఎమ్మెల్యే సందర్శించి పరిశీలించారు.

ఈ సందర్భంగా వైద్యాధికారులు అలసత్వం వహించకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని శాఖల అధికారులను సమన్వయపరిచి గ్రామంలో అనారోగ్య సమస్యలు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే రాములునాయక్ మాట్లాడుతూ.. ప్రజలు జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. తాటిపూడి గ్రామంలో డెంగ్యూ లక్షణాలతో పలువురు మృతి చెందడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో వైరా ఎంపీపీ వేల్పుల పావని, జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, వైరా సొసైటీ చైర్మన్ తాతా రంగారావు, సర్పంచ్, బట్టా పెద్ద భద్రయ్య, మండల వైద్యాధికారి సుచరిత, ఎంపీడీవో రామ్మోహన్‌రావు, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు సూతకాని జైపాల్, గుమ్మా రోశయ్య, పసుపులేటి మోహన్‌రావు, ఎంపీటీసీ ముళ్లపాటి సీతారాములు, నాయకులు దార్న రాజశేఖర్, చల్లా సతీష్, జవ్వాజి క్రిష్ణయ్య, జవ్వాజి నాగరాజు, ఉప సర్పంచ్ మన్నెం సత్యానందం పాల్గొన్నారు.

206
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles