ప్రగతి బాటలో.. పల్లెలు

Sat,October 5, 2019 11:53 PM

-ప్రజల భాగస్వామ్యం ఉంటేనే గ్రామాల అభివృద్ధి
-ఇదే స్ఫూర్తి మున్ముందు కొనసాగాలి
-సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య

సత్తుపల్లి, నమస్తే తెలంగాణ: దేశంలో...రాష్ట్రంలో ఏ గ్రామమైనా అభివృద్ధి పథంలో పయనించాలంటే గ్రామస్తుల సహకారం, భాగస్వామ్యం ఉంటేనే ఆ గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతాయని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. శనివారం మండల పరిధిలోని కొత్తూరు గ్రామపంచా యతీలో పల్లెప్రగతి ప్రణాళికలో భాగంగా కలెక్టర్ ఆర్‌వీ.కర్ణన్, అసిస్టెంట్ కలెక్టర్ హన్మంత్ కొడింబాలతో కలిసి గ్రామంలో పర్యటించారు. ముందుగా గ్రామంలో రూ.31లక్షలతో నిర్మించతలపెట్టిన సీసీ రోడ్డు, డ్రైన్లకు శంకుస్థాపన చేశారు. అనం తరం గ్రామంలో పర్యటించి ఇంకుడు గుంతలు, సైడ్‌డ్రైన్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం జరిగిన సమా వేశంలో ఆయన మాట్లాడుతూ గతం లో రేజర్ల పంచాయతీలో విలీనమై ఉన్న కొత్తూరు ఏడాది క్రితం నూతన పంచా యతీగా ఏర్పాటైందని, అప్పటి ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ ఒగ్గు విజయ లక్ష్మి శ్రీనివాసరెడ్డి గ్రామ దశ, దిశ మార్చడానికి శ్రీకారం చుట్టారన్నారు. గ్రామంలో నిరంతరం పర్యటిస్తూ అభివృద్ధి కోసం పాటు పడుతున్నారన్నారు. గ్రామంలో పూర్తిస్థాయిలో సైడ్‌డ్రైన్ల పూడికతీత, ట్రీగార్డుల ఏర్పాటు, సీసీ కెమె రాల ఏర్పాటు చేస్తూనే పరిశుభ్రత కోసం గ్రామంలోని ప్రతి ఇంటికి రెండు చెత్తబుట్టలు, జూట్ బ్యాగులు అందించడం అభినందనీయమన్నారు.

ఇదే స్ఫూర్తి మున్ముందు కొనసాగిస్తే గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందని సర్పంచ్ దంపతులను వారు అభినందించారు. గ్రామంలో పంచాయతీ భవనం లేదని సర్పంచ్ విజయలక్ష్మి ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా త్వరలోనే భవన నిర్మాణానికి నిధులు మం జూరు చేస్తామని హామీ ఇచ్చారు. ప్లాస్టిక్ నిషేధ గ్రా మంగా మార్చడానికి సర్పంచ్ దంపతులు గ్రామం లో ఉచితంగా చెత్తబుట్టలు,గుడ్డ సంచులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. సత్తుపల్లి సిం గరేణి బ్లాస్టింగ్‌ల వల్ల ఎన్టీఆర్ నగర్, పట్టణంలో భవనాలు, ఇళ్లు దెబ్బతింటున్నాయని,పరిసర ప్రాం త గ్రామప్రజల పంటలు, ఆరోగ్యం దెబ్బతింటుందని, ఈ విషయాన్ని సింగరేణి సీ ఎండీ దృష్టికి కూడా తీసుకువెళ్లామని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అటవీ, రెవెన్యూ శాఖల మధ్య గిరిజన, గిరిజనేతర రైతులు నలిగిపోతున్నారని, ఆ సమస్యను వెంటనే పరిష్కరించేలా కలెక్టర్ దృష్టిసారిం చాలన్నారు. సాగులో ఉన్న రైతులకు న్యాయం చేయాలని సూచించారు.

జిల్లాలోనే అభివృద్ధిలో ఆదర్శగ్రామంగా కొత్తూరు: కలెక్టర్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి 30 రోజుల ప్రణా ళికలో భాగంగా జిల్లాలోనే మండల పరిధిలోని కొత్తూరు ఆదర్శగ్రామంగా నిలిచి జిల్లాలో అన్ని పంచాయతీలకు రోల్‌మోడల్‌గా గుర్తింపు తెచ్చుకుందన్నారు. గ్రామంలో ఇంకుడు గుంతలు, రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటించి ట్రీగార్డుల ఏర్పాటు, రూ.2లక్షలతో 9 సీసీ కెమెరాల ఏర్పాటు అభినందనీయమన్నారు. జిల్లాలో అన్ని గ్రామ పంచాయతీలకు కొత్తూరు గ్రామం ఆదర్శంగా నిలవాలన్నారు. అన్ని పంచాయతీల సర్పంచ్‌లను ఇక్కడకు తీసుకువచ్చి గ్రామాభివృద్ధి జరిగిన తీరును వివరిస్తామని వివరించారు. ఇదే స్ఫూర్తితో మున్ముందు కొనసాగించి జిల్లాకు ప్రతి పంచాయతీ రోల్ మోడల్‌గా నిలవాలన్నారు.పారిశుధ్య పనుల్లో ముందున్న సర్పంచ్ ఒగ్గు విజయలక్ష్మి శ్రీనివాసరెడ్డి దంపతులు, పాలకవర్గాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు చెత్తబుట్టలు, గుడ్డ సంచులు అం దించడం అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో శివాజీ, తహసీల్దార్ విజయ్‌కుమార్, ఎంపీడీవో సుభాషిణి, కల్లూరు ఏసీపీ వెంకటేష్, పంచాయతీరాజ్ డీఈ నళినీమోహన్, మండల స్పెషలాఫీసర్ ధన్‌రాజ్, ఎంపీపీ దొడ్డా హైమావతి శంకర్‌రావు, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, ఎంపీటీసీ ఇసంపల్లి వెంకటేశ్వరరావు, వైస్ సర్పంచ్ పెద్దిరెడ్డి పురుషోత్తం, నాయకులు చల్లగుళ్ల నర్సింహారావు, కొత్తూరు ప్రభాకరరావు, సాంబశివరావు, శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, ఒగ్గు జగ్గారెడ్డి, లక్ష్మీ, కుమారి, భాగ్యలక్ష్మి, చల్లా రవీంద్రారెడ్డి, మందపాటి సోమిరెడ్డి, చిలుకూరి ప్రసాదరెడ్డి, ఐనంపూడి రవి తదితరులు పాల్గొన్నారు.

246
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles