అన్నిదానాల్లో కెల్లా అన్నదానం మిన్న

Sat,October 5, 2019 11:51 PM

ఖమ్మం రూరల్, నమస్తేతెలంగాణ: అన్నిదానాల్లో కెల్లా అన్నదానం మిన్న అని శ్రీ సిటి చైర్మన్ గరికపాటి వెంకట్రావ్ అన్నారు. శనివారం రూరల్ మండలం ఆరెంపుల గ్రామంలో ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమాన్ని వీఏ డెవలపర్స్ అధినేత గరికపాటి అంజనేయప్రసాద్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవీనవరాత్రుల్లో భాగంగా అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేసి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమైన విషయమన్నారు. కొన్ని సంవత్సరాలుగా దేవీనవరాత్రుల్లో భాగంగా ఇక్కడ అమ్మవారిని ఏర్పాటు చేసి నిత్యం పూజలు, అన్నదానం, కుంకుమ పూజ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న మాజీ సర్పంచ్ బండి జగదీశ్‌ను అభినందించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో రమేశ్‌బాబు, నాని, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

235
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles