ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడండి..

Sat,October 5, 2019 11:51 PM

-బస్సులను యథావిధిగా నడిపించాలి కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్
ఖమ్మం, నమస్తే తెలంగాణ : ఆర్టీసీ సమ్మె వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లుతో బస్సులను యథావిధిగా నడిపించాలని కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ ఖమ్మం బస్‌డిపో మేనేజర్ శివకుమార్, సత్తుపల్లి డిపో మేనేజర్ జేవీ బాబులతో చర్చించారు. శనివారం ఖమ్మం డిపో, సత్తుపల్లి డిపోలను సందర్శించారు. ఈ సం దర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అనుభవజ్ఞులైన డ్రైవర్లు, ఇతర సిబ్బందితో అన్ని ప్రాంతాలకు బస్సులు పంపాలని, ప్రజలకు ఎటు వంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. అదే విధంగా శాంతి భద్రతలను కట్టుదిట్టం చేయాలని, బస్‌డిపో, బస్‌స్టాండ్ ప్రాంతాలలో 144 సెక్షన్ విధించాలని పోలీసు అధికారులను ఆ దేశించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, ఇతర అధికారులు తదితరులున్నారు.

231
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles