అశ్వమేథయాగ గాయత్రి కలశ యాత్రకు స్వాగతం

Sat,October 5, 2019 11:50 PM

కూసుమంచి,అక్టోబర్ 5: విశ్వ గాయత్రి పరివార్ ఆధ్వర్యంలో వచ్చే జనవరిలో నిర్వహించే అశ్వమేథగా యత్రి మహాయజ్ఞం కలశయాత్రకు కూసుమంచిలో ఘనస్వాగతం ల భించింది. సాయంత్రం 6.30 గంటలకు సూ ర్యాపేట నుంచి కూసుమంచి చేరుకున్న కలశయాత్రకు ఎమ్మెల్యే కం దాల ఉపేందర్‌రెడ్డి, స్థా నిక వాసవీక్లబ్ సభ్యు లు, టీఆర్‌ఎస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. హరిద్వార్ నుంచి బయలుదేరిన ఈయాత్ర తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యటించి, వచ్చే జనవరి 2న సికింద్రాబాద్ చేరుకుంటుంది. అక్కడి మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో జనవరి నుంచి 5 వరకు అశ్వమేథ గాయత్రి మహాయజ్ఞం నిర్వహిస్తారని నిర్వాహకులు తెలిపారు. వాతావరణ కాలుష్యాన్ని పారదోలి, దేశాన్ని సమ ర్థ్ధవంతంగా,శక్తివంతంగా సుసంపన్నం చేయడానికి ఈ ఆధ్యాత్మిక ప్రయోగం చేస్తున్నట్లు గాయత్రి పరివార్ ప్రతినిధులు పేర్కొన్నారు. కలశయాత్రకు స్వాగతం పలికిన వారిలో కూసుమంచి ఎంపీటీసీ మాదాసు ఉపేందర్, మాజీ సర్పంచ్ గుండా దామోదర్‌రెడ్డి, బారి వీర భద్రం, ముదిరెడ్డి కేశవరెడ్డి, కొండా మహిపాల్, వర్తకసంఘం ప్రతినిధులు తిరుపతిరావు, కొత్తూరి కిషోర్ తదితరులు ఉన్నారు.

205
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles