ఖమ్మం యువకుడి పెళ్లి

Fri,October 4, 2019 12:34 AM

ఖమ్మం, నమస్తే తెలంగాణ: ప్రేమకు ఎల్లలు లేవని మరోసారి నిరూపించాడు ఖమ్మం యువకుడు. తాను ఇష్టపడిన అమ్మాయి ఖండాంతరాల అవతల ఉన్నా.. భారతీయ హిందూ సంప్రదాయం ప్రకారం మనువాడి దైవ సాక్షిగా ఒక్కటయ్యారు ఆ జంట..వివరాల్లోకి వెళితే ఖమ్మం నగరం వీడివోస్ కాలనీకి చెందిన ఏలూరి క్రాంతి కుమార్ హోం థియేటర్ల వ్యాపారం చేస్తుంటాడు. తల్లి మాధవితో కలిసి ఖమ్మంలో నివాసముంటున్నాడు. ఉక్రెయిన్‌లోని ప్రైమోర్క్స్ నగరానికి చెందిన ఇంటీరియర్ డిజైనర్ ఆలోన మ్యాక్సిమోవ అనే అమ్మాయి క్రాంతికి రెండేళ్ల క్రితం పరిచయమైంది. వీరిద్దరి స్నేహం కొద్ది కాలానికే ప్రేమకు దారి తీసింది. ఒకరినొకరు అర్థం చేసుకుని, ఇరు కుటుంబాలు ఇష్టపడిన తరువాత పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఆ మేరకు అమ్మాయి తల్లిదండ్రుల అనుమతితో గురువారం ఖానాపురంలోని బాలాజీ నగర్‌లో గల ఇద్దరూ వివాహం చేసుకున్నారు. వీరిద్దరి వివాహ వేడుక అత్యంత నిరాడంబరంగా జరిగింది. అతికొద్ది మంది కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. వీరిద్దరిని కుటుంబ సభ్యులు, స్నేహితులు అభినందించారు.

అమ్మాయి తల్లి ప్రముఖ నాయకురాలు...
అమ్మాయి తండ్రి అనాటోలి అక్కడి ఆర్మీలో ఉద్యోగ విరమణ పొందాడు. తల్లి క్లాడియా అక్కడ ప్రముఖ రాజకీయ నాయకురాలు. ఆమె నేతృత్వం వహించిన రాజకీయ పార్టీ నుంచే ఆ దేశ అధ్యక్షుడు ఎన్నికై ఈ ఏడాది ఆగస్టు వరకు పదవిలో కొనసాగాడు. ప్రస్తుతం ఆమె అక్కడి ఉపాధి కల్పన విభాగానికి డైరెక్టర్‌గా ఉన్నారు.

322
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles