సంస్కృతి, సంప్రదాయాలకు ప్రభుత్వం పెద్దపీట

Fri,October 4, 2019 12:33 AM

సత్తుపల్లి రూరల్: తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తూ తెలంగాణ ఇంటిపండుగగా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నదని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. గురువారం రాత్రి పట్టణంలోని చింతలపాటి వారి వీధి, గుడిపాడు రోడ్‌లోని శ్రీకృష్ణ మందిరం వద్ద నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం బతుకమ్మ పర్వదినం సందర్భంగా మహిళలకు ఉచితంగా చీరెలు పంపిణీ చేసి బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేసిందన్నారు.

ప్రతి మహిళా సంతోషంగా ఉండేలా రాష్ట్రంలో కోటి మంది మహిళలకు చీరెలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. అనంతరం బతుకమ్మ పేర్చిన మహిళలకు బహుమతులు అందజేశారు. ఆయన వెంట డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, ఏసీపీ వెంకటేశ్, ఎంపీపీ దొడ్డా హైమావతి శంకర్‌రావు, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, మాజీ చైర్‌పర్సన్ దొడ్డాకుల స్వాతి గోపాలరావు, అద్దంకి అనిల్, వల్లభనేని పవన్, వీరపనేని బాబి, మహేశ్, శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, మునీర్, మధు, గోపి, మల్లూరు అంకమరాజు, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

210
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles