అధికారులు అంకితభావంతో పనిచేయాలి..

Thu,September 19, 2019 11:37 PM

ఖమ్మం, నమస్తే తెలంగాణ:అధికారులందరూ అంకిత భావంతో పనిచేసి గ్రామా అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ సంబంధిత అధి కారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, ప్రత్యేక అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పల్లె ప్రగతిలో నేటి వరకు సాధించిన పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డు, వైకుంఠధామం తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ స్థలం లేకపోతే గ్రామపంచాయతీ నిధులతో స్థలం కొనుగోలు చేసి ఏర్పాటు చేయాలన్నారు. పరిశుభ్రతకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించా లన్నారు.

శిథిలావస్థలో ఉన్న భవనాలను వెంటనే కూల్చివేయాలన్నారు. అధికారులు బాధ్యతాయుతంగా క్షేత్రస్థాయిలో ప్రతీ పనిని గుర్తించి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని, క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా రాష్ట్రస్థాయి ప్లయింగ్ స్కాడ్ బృందాలు తణిఖీలు నిర్వహిస్తాయని తదనుగుణంగా గ్రామాలన్ని పరిశు భ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామంలో ప్రధాన రహదారి వెంట రోడ్లకిరువైపుల మొక్కలు నాటాలన్నారు. గ్రామాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను పూర్తిగా సేకరించి రీసైక్లింగ్‌కు పంపాలన్నారు. సమావేశంలో స్పెషల్ ఆఫీసర్, ఇన్‌చార్జ్ జిల్లా పంచాయతీ అధికారి జడ్‌కే హన్మంతు, జడ్పీ సీఈవో ప్రియాంక, ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు తదితరులున్నారు.

137
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles