సహకారం అందించడం అభినందనీయం:డీఈవో

Thu,September 19, 2019 11:37 PM

బోనకల్లు: ప్రభుత్వ పాఠశాలలకు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సహకారం అందించడం అభినందనీయమని డీఈవో మదన్‌మోహన్ అన్నారు. గురువారం మండలంలోని రావినూతల ప్రాథమిక పాఠశాలలో కిడ్స్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ వారి సహకారంతో రూ.2.25 లక్షలతో నిర్మించిన మరుగుదొడ్లను ఎస్‌ఎంసీ చైర్మన్ మరీదు నాగేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం డీఈవో మాట్లాడుతూ ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఇస్తున్న సహకారంతో విద్యార్థులు ముందుకెళ్లాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సౌకర్యాలు ప్రైవేటు పాఠశాలల్లో కనిపించవన్నారు. ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసుకొని పేద విద్యార్థుల అభ్యున్నతికి పాటుపడుతున్న కిడ్స్ చైర్మన్‌తో పాటు, వారి కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కిడ్స్ సంస్థ చైర్మన్ గిరిధర్ మాట్లాడుతూ కాకినాడ ఇంజినీరింగ్ కళాశాల పూర్వవిద్యార్థులంతా కలిసి కిడ్స్ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ఆర్గనైజేషన్ ద్వారా రెండు రాష్ర్టాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు సహకారం అందిస్తున్నట్లు ఆయన వివరించారు. ఇక్కడ పనిచేస్తున్న హెచ్‌ఎం వెంకటేశ్వరరావు లాంటి ఉపాధ్యాయులు ఉంటే ప్రభుత్వ పాఠశాలలు ఎంతగానో అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కిడ్స్ సంస్థ డైరెక్టర్లు వై.ఎస్.సుబ్రహ్మణ్యం, కృష్ణ, మోహన్, అప్పారావు, ఉషా సుబ్రహ్మణ్యం, శాంతాగిరిధర్, ఎంఈవో ఇందిరాజ్యోతి తదితరులు పాల్గొన్నారు.

133
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles