ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో పెసర్లు విక్రయించండి

Thu,September 19, 2019 11:37 PM

నేలకొండపల్లి, సెప్టెంబర్ 19:రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు అన్నారు. నేలకొండపల్లిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెసర కొనుగోలు కేం ద్రాన్ని గురువారం సాయంత్రం ప్రారంభించారు. ఈసందర్భంగా జరిగిన రైతుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి రైతుల ఇబ్బందులను సభ దృష్టికి తీసుకెళ్లడం తో స్పందించిన ప్రభుత్వం వెంటనే పెసర కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఖమ్మం, నేలకొండపల్లి, వైరాల్లోని మార్కెట్లలో పెసర కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 17 వేల ఎకరాల్లో పెసర పంటను సాగు చేశారని, ప్రభుత్వం 12 వేల క్వింటాలు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చిందన్నారు. గత ఏడాది 24 వేల క్వింటాల వరకు పెసర పంటను రైతుల నుంచి కొనుగోలు చేసినందన ఈ ఏడాది కూడా 25 వేల క్వింటాల వర కు వస్తుందన్నారు. పెసరకు కేంద్రం మద్దతు ధరను రూ.7050 లు ప్రకటించిందన్నారు. బయటి మార్కెట్‌లో రైతులు రూ.5 వేలకు విక్రయించిన నష్టపోతున్నారని, రైతులు నష్టానికి అమ్ము కోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలన్నారు.

రాష్ట్రంలో ఎరువుల కొరత ఎక్క డా లేదని స్పష్టం చేశారు. మార్క్‌ఫెడ్ డీఎం వాణి మాట్లాడుతూ నేలకొండపల్లిలోని మార్కెట్ యార్డులో బోదులబండ సొసైటీ ఆధ్వర్యంలో పెసర కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్‌పర్సన్ మరికంటి ధనలక్ష్మీ, నేలకొండపల్లి, కూసుమంచి, ఖమ్మంరూరల్ ఎంపీపీలు వజ్జా రమ్య, బానోత్ శ్రీను, బెల్లం ఉమా, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ యడవల్లి సైదులు, జిల్లా కమిటీ సభ్యురాలు ధరావత్ శాంతి, మార్కెట్ కార్యదర్శి చౌదర్‌రెడ్డి, ఏవో నారాయణరావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉన్నం బ్రహ్మయ్య, సొసైటీ చైర్మన్‌లు ఏటుకూరి ప్రకాశరావు, చింతనిప్పు సైదులు, నాయకులు నంబూరి సత్యనారాయణ, బెల్లం వేణు, ఇంటూరి శేఖర్, నెల్లూరి లీలాప్రసాద్, వజ్జా శ్రీనివాసరావు, మేకల వెంకటేశ్వర్లు, నల్లాని మల్లికార్జున్, వంగవేటి నాగేశ్వరావు, మల్లారపు నరసిం హరావు, కడియాల నరేష్, గోరెంట్ల కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

153
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles