మూడో రోజు సహాయ చర్యల్లో మంత్రి అజయ్..

Wed,September 18, 2019 12:32 AM

ఖమ్మం,నమస్తే తెలంగాణ:రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మూడు రోజులుగా రాజమండ్రిలోనే ఉంటూ పరిస్థితిని సమీక్షిస్తు న్నారు. లాంచీ ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. బాధిత బంధువులకు సమాచారం అందించడం, మృతదేహాల తరలింపు దగ్గరుండి చూసుకుంటున్నారు. రాజమండ్రి, ధవళేశ్వరం, కచ్చలురు, దేవి పట్నం తదితర ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలు వేగవంతం చేశారు. తెలంగాణకు చెందిన మృతుల కుటుంబాలను ఓదా ర్చారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని భరోసానిచ్చారు. ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుని సీఎం కేసీఆర్‌కు ఫోన్‌లో అందజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్, నేవి, ఎన్‌డీఆర్‌ఎఫ్‌తో సమన్వ యం చేస్తూ పర్యటించారు. పడవ మునిగిన ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్, పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాస్‌తో కలిసి ఏరియల్ సర్వే ద్వారా పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరు, అక్కడ ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
పడవ ప్రమాదంలో గల్లంతైన వారిలో 8 మృతదేహాలు లభ్యం
మామిళ్లగూడెం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రాంతంలో జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతైన వారిలో మంగ ళవారం మరో 8 మంది మృతదేహాలు లభ్యమయ్యా యి. వాటిని పోస్టుమార్టం తరువాత మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, ఎర్రబెల్లి దయాకర్‌రావులు మృతదేహాలను ప్రత్యేక అంబులెన్స్‌ల ద్వారా తెలంగాణలోని మృతుల గ్రామాలకు తరలించారు. ఇప్పటికే 12 మంది మృతదేహాలను వారి వారి బంధువులకు అందజేశారు. అదే విధం గా ప్రమాదంలో గాయపడిన, అనారోగ్య పాలైన మరో 13 మంది బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించిన తరువాత వారిని వారి వారి నివాసాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు లతో పంపించారు. గుర్తించిన మృతదేహాలలో సాయికుమార్ - మదాపూర్, సునీల్- చిన్నపెండ్యాల, బస్కి వెంకటరామయ్య- కండిపికొండ, బీ రాజేంద్రప్రసాద్ - కండిపికొండ, పీ తరుణ్‌రెడ్డి - హాల్యా, విష్ణుకుమార్- నేలకొండపల్లి తదితరుల మృతదేహాలను వారి బంధువులకు అప్పగించా రు. అనంతరం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న కారణంగా మం త్రులిద్దరు హైదరాబాద్ బయలుదేరారు. ఇంకా బాధితులకు సహాయంగా సంఘటన స్థలంలో వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఉన్నారు.

138
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles