సోమిదేవమ్మ జలపాతం వద్ద పర్యాటకుల సందడి

Mon,September 16, 2019 12:23 AM

చర్ల: భద్రాచలం ఏజెన్సీ చర్లమండలంలోని దండకారణ్యం సరిహద్దు అడవులు ప్రకృతి అందాలకు నెలవులు. దట్టమైన అడవులు, గల గలపారే సెలయేర్లు, కొండలమీదినుంచి దూకే జలపాతాలు ఎన్నో ఉన్నాయి. చర్ల నుంచి చూస్తే కనిపించే ఎత్తయిన గుట్టల్లో ఈ ప్రాంతం ప్రజలకు సుపరి చితమైన గుట్ట సోమిదేవమ్మగుట్ట. సోమిదేవమ్మ గుట్టకు సమీపంలో ఎత్తయిన కొండపైనుంచి పారే జలపాతం ఇటీవల వెలుగులోకి వచ్చింది. తొలిసారిగా కొందరు పాతచర్ల గ్రామానికి చెందిన యువకులు కొందరు అనేక వ్యయ ప్రయాలకోర్చి జలపాతం వద్దకు చేరు కున్నారు. వారిద్వారా సోమి దేవమ్మగుట్టపైనుంచి దూకే జలపాతం వెలుగులోకి వచ్చింది. జలపాతం కనువిందుచేస్తుంది. యువకులతోపాటు మహిళలు, పిల్లలుకూడా జలపాతాన్ని సందర్శిస్తున్నారు. మండలకేంద్రానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలోఉన్న సోమిదేవమ్మగుట్ట జలపాతానికి చేరుకునేందుకు సుమారు నాలుగు కిలోమీటర్లు అడివిలో నడవాల్సి ఉంటుంది.

183
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles