పలు కుటుంబాలకు మాజీ ఎంపీ పరామర్శ

Mon,September 16, 2019 12:23 AM

ముదిగొండ: ఖమ్మం మాజీ ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం పలు కుటుంబాలను పరామర్శించారు. ముదిగొండ పరిధిలోని వనంవారి క్రిష్ణాపురం గ్రామానికి చెందిన ఫొటో గ్రాఫర్ ముడుసు వెంటేష్ జ్వరంతో మృతిచెందాడు. అతని కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయ చేయటంతో పాటు అండగా ఉంటానాని వారికి భరోసా ఇచ్చారు. సొసైటీ చైర్మన్ బత్తుల వెంక ట్రావ్ పెదనాన్న బత్తుల లక్ష్మయ్య, దోమల యోహాను, పండ్రకోల గ్రేసమ్మ, గోద కొండయ్య, దుస్సు క్రిష్ణ కుటంబ సభ్యులను ఆయన పరామర్శించారు. నమస్తే తెలంగాణ విలేకరి వనం శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదేవిధంగా గోకినేపల్లి గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం మధిర నియోజకవర్గ సభ్యుడు దరిపల్లి వీరబాబు తండ్రి మరణించగా కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మీగడ శ్రీనివాస్ యాదవ్, మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ పోట్ల వెంకట ప్రసాద్, ముత్తారం మాజీ సర్పంచ్ తుపాకుల ఎలగొండ స్వామి, సీనియర్ నాయకులు బత్తుల వీరారెడ్డి, అనంతరెడ్డి, పసుపులేటి వెంకట్, వెంకటనాగప్రసాద్, మందరపు ఎర్ర వెంకన్న, మౌలానా, నాయకులు యాకూబ్, నరేష్, బోస్ తదితరులు పాల్గొన్నారు.

169
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles