విద్యుత్ సమస్యల పరిష్కారమే లక్ష్యం

Sun,September 15, 2019 12:37 AM

-ఎన్‌పీడీఎల్ డైరెక్టర్ బుగ్గవీటి
తల్లాడ: 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామాల్లో ఉన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించడమే తమ లక్ష్యమని ఎన్‌పీడీఎల్ డైరెక్టర్ బుగ్గ వీటి వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం మండల పరిధిలోని రంగం బంజరలో విద్యుత్ సమస్యలను అధికారులను, ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామాలను అభివృద్ధి చేసేందుకు అన్ని రకాల సమస్యలపై దృష్టిసారించిందన్నారు. ప్రధానంగా గ్రామాల్లో ట్రాన్స్‌ఫార్మర్ల పనితీరు ఎలా ఉంది, కేబుల్‌వైర్లు సక్రమంగా ఉన్నాయా లేదా చూడటంతో పాటు, అర్హులైన వారికి విద్యుత్ మీటర్లు అందజేయడం, అవసరమైన చోట నూతన స్తంభాలు ఏర్పాటు చేయడం, దూరాన్ని బట్టి కూడా ప్రజల అవసరాల మేరకు పోల్‌కుపోల్‌కు మధ్యలో స్తంభాలు ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.

విద్యుత్‌శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాల్లో విద్యుత్ సమస్యలు లే కుండా చూస్తున్నామన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్యలు లేకుండా చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లో 30 రోజుల కార్యచరణలో భాగంగా పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా చీఫ్‌ఇంజినీర్ రమేష్, డీఈ వెంకటేశ్వర్లు, ఏడీఈలు హరీష్, సంజయ్, ఏఈ రాజేష్, సర్పంచ్ మాలోతు కళ్యాణి, మాలోతు లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.

167
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles