డీడీవోపీ ఉపేందర్‌కు బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ అవార్డు

Sun,September 15, 2019 12:37 AM

ఖమ్మం లీగల్, సెప్టెంబర్ 14 : ఉమ్మడి ఖమ్మం జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ రేణుకుంట్ల ఉపేందర్‌కు బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ అవార్డు లభించింది. కన్విక్షన్స్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఖమ్మం జిల్లా రెండో స్థానంలో నిలవడం, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విజయవంతంగా ప్రాసిక్యూషన్స్ నిర్వహించడం వంటి అంశాల ఆధారంగా ఉపేందర్‌కు బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ అవార్డు లభించింది. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర డీజీపీ, డీవోపీ ఆధ్వర్యంలో అవార్డులు ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఉపేందర్‌కు ప్రశంసాపత్రం అందచేశారు. డీడీవోపీ రేణుకుంట్ల ఉపేందర్‌కు బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ అవార్డు రావడం పట్ల అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యాయవాదులు శుభాకాంక్షలు తెలిపారు.

155
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles