రైతులు తొందరపడి పెసలు విక్రయించొద్దు..

Sat,September 14, 2019 12:12 AM

-మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసే విధంగా కృషి : ఎమ్మెల్యే కందాల
ఖమ్మం రూరల్, నమస్తేతెలంగాణ, సెప్టెంబర్ 13: రైతులు అరుగాలం కష్టపడి పండించిన పెసర పంటను మార్క్‌ఫెడ్ ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వంతో మాట్లాడుతున్నానని, రైతులు తొందరపడి పెసళ్లు విక్రయించొద్దుని పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు. మార్కెట్లో వ్యాపారులు క్వింటాలకు ధర రూ.5400మాత్రమే చేల్లిస్తున్నారని, దీని వలన రైతులకు నష్టం జరుగుతుందన్నారు. వ్యాపారులకు, మార్క్‌ఫెడ్‌కు మధ్య సుమారు క్వింటాలకు రూ. 2వేల తేడా ఉందన్నారు. ఖమ్మం మార్కెట్‌లో ఒకటి రెండు రోజుల్లో మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మార్క్‌ఫెడ్‌లో ధర క్వింటాలకు సుమా రూ.7వేలకు పైగానే పలుకుతున్న దృష్టా రైతులు వేచి ఉండాలన్నారు.

85
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles