పల్లె ప్రణాళిక విజయవంతం చేయాలి..

Sat,September 14, 2019 12:11 AM

-జిల్లా ఎంప్లాయీమెంట్ అధికారి శ్రీరామ్
చింతకాని, సెప్టెంబర్ 13 : సీఎం కేసీఆర్ సూచించిన 30రోజుల పల్లె ప్రణాళికలను స్థానిక ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని జిల్లా ఎంప్లాయీమెంట్ అధికారి శ్రీరామ్ శుక్రవారం అన్నారు. మండలంలో కోమట్లగూడెంలో మండల అధికారులు, ప్రజాప్రతినిధులతో కలసి గ్రామంలో పర్యటించారు. పరిసరాల పరిశుభ్రతను పరిశీలించి అధికారులకు, గ్రామస్తులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్లె ప్రగతి కార్యాచరణలను ప్రతీ అధికారి, ప్రజాప్రతినిధులు బాధ్యతగా నిర్వహించాలని, గ్రామాల్లో ప్రజల మౌలిక వసతుల కల్పన, పారిశుధ్యం, హరితహారం తదితర అంశాలను ప్రాధాన్యతా క్రమంలో తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రస్తుత సీజనల్ వ్యాధుల పట్ల గ్రామాల్లోని ప్రజలు జాగ్రత్త వహించాలని, తమ పరిసరాల్లో పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని వారు సూచించారు. సీఎం కేసీఆర్ ఆశయాలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. లచ్చగూడెంలో జడ్పీటీసీ పర్చగాని తిరుపతి కిశోర్, ఆయా గ్రామాలలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఉపసర్పంచ్‌లు, ఎంపీడీఓ దావులూరి లలితకుమారి, తహసీల్దార్ కే సత్యనారాయణ, డీఎస్‌వో అనిల్‌కుమార్, కార్యదర్శులు, ఏఎన్‌ఎమ్‌లు, అంగన్‌వాడీలు, పాలకమండలి సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

190
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles